
డీసీ మూవీస్‌లో సూపర్ మ్యాన్‌గా పాపులర్ అయిన హెన్రీ కావిల్‌కు ఓ పాత్ర పోషించాలని ఆసక్తిగా ఉందని తెలిపాడు. అదేంటంటే.. మార్వెల్ సూపర్ హీరో కెప్టెన్ బ‍్రిటన్ క్యారెక్టర్ చేయాలని ఉత్సాహపడుతున్నట్లు చెప్పాడు కావిల్. ఆధునీకరించిన కెప్టెన్ బ్రిటన్ వర్షన్ ఎంతో సరదాగా ఉంటుందని, కెప్టెన్ అమెరికాకు ఏ మాత్రం తీసిపోదన‍్నాడు. జెమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో డానియల్ క్రేగ్ తర్వాతి బాండ్ ఎవరనే జాబితాలో కావిల్ పేరు వినిపించింది. ఇప్పుడు ఎమ్‌సీయూ నుంచి మరొక సూపర్ హీరోగా నటించాలని ముచ్చట పడుతున్నాడు.
'ఇది వరకు పోషించిన మార్వెల్ క‍్యారెక్టర్స్ గురించి నేను మాట్లడను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అయితే నేను కెప్టెన్ బ్రిటన్ గురించి కొన్ని పుకార్లు విన్నాను. ఇంటర్నెట్‌లో చూశాను. కెప్టెన్ అమెరికాను ఆధునీకరించినట్టే, కెప్టెన్ బ్రిటన్ క‍్యారెక్టర్‌ను ఆధునీకరిస్తే ఎంతో సరదాగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నాను.' అని హెన్రీ తెలిపారు. కెప్టెన్ బ్రిటన్ అంటే కెప్టెన్ అమెరికాకు సమానం. అతని అసలు పేరు బ్రియాన్ బ్రాడాక్. అతను అర్ధూరియన్ మెజిషియన్ మెర్లిన్, అతని కూతురు రోమా నుంచి మ్యాజికల్ పవర్స్‌ను పొందినవాడు. ఆ పవర్స్ అతన్ని మరింత బలిష్టంగా చేస‍్తుంది. మానవాతీత బలం, సత్తువ, వేగం, ఎగరడం వంటి సామర్థ్యాలు వచ్చేలా చేస్తాయి.
డీసీ సంస్థలో సూపర్ మ‍్యాన్‌గా మరిన్ని చిత్రాలు వచ్చే అవకాశం గురించి కావిల్ చెప్పాడు. ఐకానికి సూపర్ హీరోగా తాను చేయడానికి ఇంకా చాల కథలు ఉన్నాయన్నాడు. అవి చేసే అవకాశాన్ని ఇష్టపడతానని తెలిపాడు. సూపర్ మ్యాన్ కాకుండా హెన్రీ కావిల్ ఎనోలా హోమ్స్‌లో షేర్లాక్ హోమ్స్‌గా, టీవీ షో ది విట్చర్‌లో గెరాల్ట్ ఆఫ్ రివియాగా పేరు తెచ్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment