Super Man
-
మార్వెల్ క్యారెక్టర్ చేయలని ఉందన్న డీసీ హీరో
డీసీ మూవీస్‌లో సూపర్ మ్యాన్‌గా పాపులర్ అయిన హెన్రీ కావిల్కు ఓ పాత్ర పోషించాలని ఆసక్తిగా ఉందని తెలిపాడు. అదేంటంటే.. మార్వెల్ సూపర్ హీరో కెప్టెన్ బ్రిటన్ క్యారెక్టర్ చేయాలని ఉత్సాహపడుతున్నట్లు చెప్పాడు కావిల్. ఆధునీకరించిన కెప్టెన్ బ్రిటన్ వర్షన్ ఎంతో సరదాగా ఉంటుందని, కెప్టెన్ అమెరికాకు ఏ మాత్రం తీసిపోదన్నాడు. జెమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో డానియల్ క్రేగ్ తర్వాతి బాండ్ ఎవరనే జాబితాలో కావిల్ పేరు వినిపించింది. ఇప్పుడు ఎమ్‌సీయూ నుంచి మరొక సూపర్ హీరోగా నటించాలని ముచ్చట పడుతున్నాడు. 'ఇది వరకు పోషించిన మార్వెల్ క్యారెక్టర్స్ గురించి నేను మాట్లడను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అయితే నేను కెప్టెన్ బ్రిటన్ గురించి కొన్ని పుకార్లు విన్నాను. ఇంటర్నెట్లో చూశాను. కెప్టెన్ అమెరికాను ఆధునీకరించినట్టే, కెప్టెన్ బ్రిటన్ క్యారెక్టర్‌ను ఆధునీకరిస్తే ఎంతో సరదాగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నాను.' అని హెన్రీ తెలిపారు. కెప్టెన్ బ్రిటన్ అంటే కెప్టెన్ అమెరికాకు సమానం. అతని అసలు పేరు బ్రియాన్ బ్రాడాక్. అతను అర్ధూరియన్ మెజిషియన్ మెర్లిన్, అతని కూతురు రోమా నుంచి మ్యాజికల్ పవర్స్‌ను పొందినవాడు. ఆ పవర్స్ అతన్ని మరింత బలిష్టంగా చేస్తుంది. మానవాతీత బలం, సత్తువ, వేగం, ఎగరడం వంటి సామర్థ్యాలు వచ్చేలా చేస్తాయి. డీసీ సంస్థలో సూపర్ మ్యాన్‌గా మరిన్ని చిత్రాలు వచ్చే అవకాశం గురించి కావిల్ చెప్పాడు. ఐకానికి సూపర్ హీరోగా తాను చేయడానికి ఇంకా చాల కథలు ఉన్నాయన్నాడు. అవి చేసే అవకాశాన్ని ఇష్టపడతానని తెలిపాడు. సూపర్ మ్యాన్ కాకుండా హెన్రీ కావిల్ ఎనోలా హోమ్స్‌లో షేర్లాక్ హోమ్స్‌గా, టీవీ షో ది విట్చర్లో గెరాల్ట్ ఆఫ్ రివియాగా పేరు తెచ్చుకున్నాడు. -
వైరల్ వీడియో: ఈ సూపర్ హీరోకి నెటిజన్ల ఫిదా
సాధారణంగా చిన్న పిల్లలతో బయటకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఏది ప్రమాదం అనే విషయం బొత్తిగా తెలియదు. ఇక రోడ్డు ప్రమాదాల్లో రెప్పపాటుకాలంలోనే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. అయితే అలాంటి ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడితే..వారిని సూపర్ హీరోగా కీర్తిస్తాం. ప్రస్తుతం అటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతి, ఓ కుర్రాడు రోడ్డు దాటేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే వాహనాలు విరామం లేకుండా వస్తూనే ఉన్నాయి. దాంతో వారు రోడ్డు దాటేందుకు వీలు లేకుండా పోయింది. అదే సమయంలో ఓ చిన్నారి చూసుకోకుండా అటువైపు నుంచి రోడ్డుపైకి వచ్చేస్తుంది. అది గమనించిన కుర్రాడు... రెప్పపాటులో... రోడ్డు దాటేసి... చిన్నారిని పట్టుకొని... క్షణాల్లో రోడ్డుకు అటువైపు వెళ్లిపోయాడు. ఆ యువకుడు ఒక్క క్షణం ఆలస్యం చేసినా.. ఇద్దరు ప్రమాదం బారిన పడేవారు. కానీ ఆ కుర్రాడు వేగంగా స్పందించడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇలా అతను తన ప్రాణాలను అడ్డుగా పెట్టి.. ఓ ప్రాణాన్ని కాపాడాడు. అందుకే అంతా అతన్ని మెచ్చుకుంటున్నారు. సూపర్ హీరో అంటున్నారు. కాగా ఈ వీడియోను ఇప్పటివరకు 14 లక్షల మంది నెటిజన్లు వీక్షించగా.. వేల మంది లైక్ కొట్టారు. A little girl. And a stranger with no hesitation whatsoever. Not all heroes wear capes... pic.twitter.com/EO22qLTfMF — Rex Chapman🏇🏼 (@RexChapman) June 4, 2021 (చదవండి: వైరల్: అలకబూనిన శునకం.. కారణం ఏంటి!) -
కరోనా : వీళ్లు నిజంగానే సూపర్ హీరోలు
లండన్ : సాధారణంగానే హాలీడేస్ వస్తే అక్కడికి తీసుకెళ్లు, ఇక్కడికి తీసుకెళ్లు అంటూ పిల్లలు మారాం చేస్తుంటారు. లాక్డౌన్ కారణంగా రోజంతా ఇంట్లోనే ఉంటూ బోర్ కూడా కొడుతూ ఉంటుంది. కానీ అడుగు బయటపెడితే మహమ్మారిని ఇంటికి ఆహ్వానించినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రూ బాల్డాక్, అతని స్నేహితుడు జాసన్ బైర్డ్ తో కలిసి లండన్ వీధిల్లో తిరుగుతూ సూపర్ మ్యాన్ వేషం వేసుకొని అక్కడి పిల్లలను ఎంటర్టైన్ చేశారు. సాధారణంగా మార్షల్ ఆర్ట్స్ తరగతులు బోధించే ఆండ్రూ ఓసారి క్లాస్‌కి సూపర్ మెన్లా డ్రెస్ చేసుకొచ్చాడట. ఆరోజు పిల్లల ముఖాల్లో విరిసిన చిరునవ్వులతో గతవారం నుంచి ఇలా వీధుల్లో తిరుగుతూ పిల్లలను సంతోషపెడుతున్నాడు. సూపర్‌మెన్ గెటప్‌లో వీళ్లు చేసే స్టంట్లు చూసి పిల్లలంతా సరదాగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పటి నుంచి వీటికి తెగ లైకులు, కామెంట్లు వస్తున్నాయి. వైరస్ మహమ్మరిని సైతం లెక్కచేయకుండా పిల్లల సంతోషం కోసం ఆండ్రూ, అతని స్నేహితుడు చేస్తున్న కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. మీరు నిజంగానే సూపర్ హీరోలు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
కొత్త సూపర్‌మ్యాన్?
హాలీవుడ్ సృష్టించిన సూపర్ హీరోల్లో సూపర్ మ్యాన్ ఒకరు. డీసీ కామిక్స్‌లో ముఖ్యమైన సూపర్ హీరో సూపర్ మ్యాన్. అయితే ఈ సూపర్ మ్యాన్ పాత్ర నుంచి తప్పుకుంటున్నానని హీరో హెన్రీ కావిల్ ఇటీవల వెల్లడించారు. 2013లో వచ్చిన ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ ద్వారా డీసీ సంస్థకు సూపర్‌మ్యాన్‌గా మారారు కావిల్. ఆ తర్వాత వచ్చిన ‘సూపర్‌మ్యాన్ వర్సెస్ బ్యాట్‌మ్యాన్, జస్టిస్ లీగ్’ సినిమాల్లో సూపర్‌మ్యాన్‌గా సాహసాలు చేశారాయన. కారణం బయటకు చెప్పలేదు కానీ తదుపరి భాగంలో భాగం కానని దర్శక–నిర్మాతలకు తేల్చి చెప్పేశారు హెన్రీ. దాంతో సూపర్ మ్యాన్‌గా సూట్ అయ్యే నటుడి వేటలో పడింది డీసీ సంస్థ. ఈ సందర్భంగా జేమ్స్ బాండ్ పాత్రకి నటులు మారినట్లే సూపర్‌మ్యాన్ పాత్రను కూడా కొత్త హీరోలు చేయాలని పేర్కొంది డీసీ సంస్థ. మరి కొత్త సూపర్‌మ్యాన్‌గా ఎవరొస్తారో వేచి చూడాలి. -
మీకు తెలుసా?
సూపర్... పారితోషికం హాలీవుడ్ చిత్రాల్లో పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే క్యారెక్టర్స్‌లో సూపర్ మ్యాన్ ఒకటి. 1978లో వచ్చిన తొలి ‘సూపర్ మ్యాన్’ చిత్రంలో అప్పటి ప్రముఖ నటుడు మార్లిన్ బ్రాండో సూపర్‌మ్యాన్‌కు తండ్రిగా కీలక పాత్ర చేశారు. ఆ పాత్ర తెరపై కనిపించేది కొన్ని నిమిషాలే అయినా, ఆయన 16 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నారు. అప్పట్లో 350 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం అంతకు ఐదింతలకు పైగా వసూలు చేసింది. -
సూపర్‌మ్యాన్.. సూపర్ వైరస్
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు తాజాగా సూపర్‌మ్యాన్, థోర్ వంటి సూపర్ హీరో క్యారెక్టర్లతో ఆన్లైన్ దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి క్యారెక్టర్ల పేర్లతో కూడిన హానికారక సాఫ్ట్వేర్లు, వైరస్‌లతో యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని, పాస్‌వర్డ్‌లను తస్కరిస్తున్నారు. సెక్యూరిటీ సర్వీసులు అందించే మెకాఫీ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ‘అత్యంత మోసకారి సూపర్‌హీరో’ అపఖ్యాతిని సూపర్‌మ్యాన్ దక్కించుకున్నాడు. సూపర్‌మ్యాన్ పేరుతో సెర్చి చేస్తే.. మోసాలు జరిగే ఆస్కారం ఉన్న సైట్లలోకి మళ్లే అవకాశాలు అత్యధికంగా 16.5 శాతం మేర ఉన్నాయి. ఉదాహరణకు సూపర్ మ్యాన్ .. టారెంట్ డౌన్లోడ్ అని, సూపర్‌మ్యాన్ అండ్ వాచ్ అని, సూపర్‌మ్యాన్ అండ్ ఫ్రీ యాప్ అని సెర్చి చేస్తే.. వ్యక్తిగత సమాచారం చోరీ చేసే విధంగా రూపొందిన సైట్లలోకి వెళ్లే రిస్కులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సైట్ల నుంచి పిక్చర్స్ లేదా వీడియోలను డౌన్లోడ్ చేసుకుంటే వాటితో పాటు వైరస్లు, మాల్వేర్లు కూడా మన సిస్టంలోకి డౌన్లోడ్ అవుతాయి. తాజాగా బ్యాట్‌మ్యాన్ వర్సస్ సూపర్‌మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సూపర్హీరోలిద్దరూ.. లిస్టులో టాప్ స్థాయికి చేరుకోవచ్చని మెకాఫీ పేర్కొంది. ఇటువంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే.. ఉచిత కంటెంట్‌ను, నమ్మశక్యం గాని విధంగా ఆఫర్లు ఇచ్చే వెబ్సైట్ల నుంచి దూరంగా ఉండాలని తెలిపింది. -
ప్రపంచ కప్... వింతలు - విశేషాలు
-
ఒక్క రివెంజ్‌తో ఇతడి రేంజ్ ఎక్కడికో పాకింది!