
హెన్రీ కావిల్
హాలీవుడ్ సృష్టించిన సూపర్ హీరోల్లో సూపర్ మ్యాన్ ఒకరు. డీసీ కామిక్స్‌లో ముఖ్యమైన సూపర్ హీరో సూపర్ మ్యాన్. అయితే ఈ సూపర్ మ్యాన్ పాత్ర నుంచి తప్పుకుంటున్నానని హీరో హెన్రీ కావిల్ ఇటీవల వెల్లడించారు. 2013లో వచ్చిన ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ ద్వారా డీసీ సంస్థకు సూపర్‌మ్యాన్‌గా మారారు కావిల్. ఆ తర్వాత వచ్చిన ‘సూపర్‌మ్యాన్ వర్సెస్ బ్యాట్‌మ్యాన్, జస్టిస్ లీగ్’ సినిమాల్లో సూపర్‌మ్యాన్‌గా సాహసాలు చేశారాయన. కారణం బయటకు చెప్పలేదు కానీ తదుపరి భాగంలో భాగం కానని దర్శక–నిర్మాతలకు తేల్చి చెప్పేశారు హెన్రీ. దాంతో సూపర్ మ్యాన్‌గా సూట్ అయ్యే నటుడి వేటలో పడింది డీసీ సంస్థ. ఈ సందర్భంగా జేమ్స్ బాండ్ పాత్రకి నటులు మారినట్లే సూపర్‌మ్యాన్ పాత్రను కూడా కొత్త హీరోలు చేయాలని పేర్కొంది డీసీ సంస్థ. మరి కొత్త సూపర్‌మ్యాన్‌గా ఎవరొస్తారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment