super man series
-
కొత్త సూపర్‌మ్యాన్?
హాలీవుడ్ సృష్టించిన సూపర్ హీరోల్లో సూపర్ మ్యాన్ ఒకరు. డీసీ కామిక్స్‌లో ముఖ్యమైన సూపర్ హీరో సూపర్ మ్యాన్. అయితే ఈ సూపర్ మ్యాన్ పాత్ర నుంచి తప్పుకుంటున్నానని హీరో హెన్రీ కావిల్ ఇటీవల వెల్లడించారు. 2013లో వచ్చిన ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ ద్వారా డీసీ సంస్థకు సూపర్‌మ్యాన్‌గా మారారు కావిల్. ఆ తర్వాత వచ్చిన ‘సూపర్‌మ్యాన్ వర్సెస్ బ్యాట్‌మ్యాన్, జస్టిస్ లీగ్’ సినిమాల్లో సూపర్‌మ్యాన్‌గా సాహసాలు చేశారాయన. కారణం బయటకు చెప్పలేదు కానీ తదుపరి భాగంలో భాగం కానని దర్శక–నిర్మాతలకు తేల్చి చెప్పేశారు హెన్రీ. దాంతో సూపర్ మ్యాన్‌గా సూట్ అయ్యే నటుడి వేటలో పడింది డీసీ సంస్థ. ఈ సందర్భంగా జేమ్స్ బాండ్ పాత్రకి నటులు మారినట్లే సూపర్‌మ్యాన్ పాత్రను కూడా కొత్త హీరోలు చేయాలని పేర్కొంది డీసీ సంస్థ. మరి కొత్త సూపర్‌మ్యాన్‌గా ఎవరొస్తారో వేచి చూడాలి. -
సూపర్ మేన్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది
లాస్ ఎంజెల్స్: సూపర్ మేన్ తొలి గర్ల్ ఫ్రెండ్ నోయెల్ నెయిల్ చనిపోయింది. 95 ఏళ్ల పడిలో అడిగుపెట్టిన ఆమె వయోభారంతో తలెత్తిన అనారోగ్యం వల్ల ప్రాణాలు విడిచింది. సూపర్ మేన్ పేరిట టీవీ నుంచి సినిమాల వరకు ఇప్పటికీ పలు సినిమాలు, కార్యక్రమాలు వస్తున్న విషయం తెలిసింది. అయితే, సూపర్ మేన్ తొలి చిత్రంలో హీరో సరసన నోయెల్ నటించారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అరిజోనాలోని టస్కాన్లో జూలై 3 తుది శ్వాస విడిచినట్లు ఆమె మేనేజర్ ల్యారీ వార్డ్ ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు. 1948లో మొట్టమొదటిసారి సూపర్ మేన్ సిరీస్ ప్రారంభమైంది. ఇందులో ఆమె నటిగా పండించిన హాస్యం అంతా ఇంత కాదు. ఆ తర్వాత అటామ్ మేన్ వర్సెస్ సూపర్ మేన్, అడ్వెంచర్స్ ఆఫ్ సూపర్ మేన్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. మిన్నేపొలిస్లో జన్మించినఘామె వాస్తవానికి జర్నలిస్టుగా మారాలనుకుంది. టీనేజ్ లో ఉండగా మోడల్ గా కూడా తనదైన ముద్రను వేసుకుంది.