Josh Duhamel Announces Engagement To Audra Mari: Ex Wife Fergie Congratulates To Him Details Inside - Sakshi
Sakshi News home page

Josh Duhamel: నటుడి పెళ్లి ప్రపోజల్‌, ఒప్పుకున్న ప్రియురాలు

Published Mon, Jan 10 2022 10:52 AM | Last Updated on Mon, Jan 10 2022 11:10 AM

Josh Duhamel Announces Engagement To Audra Mari: Ex Wife Fergie Congratulates To Him - Sakshi

Josh Duhamel Engagement: ట్రాన్స్‌ఫార్మర్స్‌ స్టార్‌ జోష్‌ దుహమెల్‌ రెండో పెళ్లికి రెడీ అ‍య్యాడు. ఈ మేరకు ప్రియురాలు ఆద్రామరితో నిశ్చితార్థం కూడా జరుపుకున్నాడు. జనవరి 8న ఆద్రా బర్త్‌డే. ఇదే సరైన సమయం అనుకున్న జోష్‌ 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని ఓ లేఖ ద్వారా ప్రశ్నించగా ఆమె సిగ్గుపడుతూ ఓకే చెప్పేసింది. దీంతో సంతోషం పట్టలేకపోయిన జోష్‌ ఆమె ఒప్పుకుందోచ్‌ అంటూ ఈ శుభవార్తను సోషల్‌ మీడియాలో వెల్లడించగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా జోష్‌ ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత భార్య ఫెర్గీకి 2019లో విడాకులిచ్చాడు. అదే సమయంలో ఆద్రాకు దగ్గరైన ఆయన ఆమెను పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్లుగానే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇక ఈ విషయం తెలిసిన అతడి మాజీ భార్య కొత్త జీవితం మొదలుపెట్టబోతున్న జోష్‌కు శుభాకాంక్షలు తెలిపింది. కాగా ఆద్రామరి పేరుగాంచిన ప్రొఫెషనల్‌ మోడల్‌. 2014లో మిస్‌ నార్త్‌ డకోటా యూఎస్‌ఏ టైటిల్‌ గెలుచుకున్న ఆమె 2016లో మిస్‌ వరల్డ్‌ అమెరికాగా కిరీటం దక్కించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement