నటుడు ఇయాన్‌ ఇకలేరు | British actor Ian Holm passaway | Sakshi
Sakshi News home page

నటుడు ఇయాన్‌ ఇకలేరు

Published Sat, Jun 20 2020 6:07 AM | Last Updated on Sat, Jun 20 2020 6:07 AM

British actor Ian Holm passaway - Sakshi

ఇయాన్‌ హోల్మ్‌

ప్రముఖ ఇంగ్లీష్‌ నటుడు ఇయాన్‌ హోల్మ్‌ (88) మృతి చెందారు. ‘‘ఇయాన్‌ హోల్మ్‌గారు ఇక లేరని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. శుక్రవారం ఉదయం ఆయన హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు’’ అని హోల్మ్‌ మేనేజర్‌ పేర్కొన్నారు. ఇక ఇయాన్‌ సినిమాల విషయానికి వస్తే... ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’, ‘ఏలియన్‌’, ‘కింగ్‌ లియర్‌’, ‘ది స్వీట్‌ హియర్‌ ఆఫ్టర్‌’, ‘డ్రీమ్‌ చైల్డ్‌’, ‘డ్యాన్స్‌ విత్‌ ఏ స్ట్రేంజర్‌’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించారు ఇయాన్‌. ‘ఛారియట్స్‌ ఆఫ్‌ ఫైర్‌’ చిత్రంలో ఇయాన్‌ నటన ఆయన్ను ఆస్కార్‌ అవార్డ్‌ (బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ కేటగిరీ)కు నామినేట్‌ చేసింది. ఇయాన్‌ మృతి పట్ల పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement