
హాలీవుడ్ నటుడు ఫ్రెడ్ విలియార్డ్
ప్రముఖ హాలీవుడ్ నటుడు ఫ్రెడ్ విలియార్డ్ ఇటీవల మరణించారు. 86 ఏళ్ల ఫ్రెడ్ నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమార్తె ట్వీటర్ ద్వారా ప్రకటించారు. ‘రాత్రి నిద్రలోనే మా నాన్నగారు ప్రశాంతంగా కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులోనూ ఆయన చాలా చలాకీగా ఉన్నారు. ఆయన్ని మేమంతా మిస్ అవుతాం’’ అని పేర్కొన్నారు హాప్ విలియార్డ్. ఫ్రెడ్ మంచి కామెడీ యాక్టర్ గా పేరు పొందారు. ‘ఎవ్రీబడీ లవ్స్ రేమండ్, మోడ్రన్ ఫ్యామిలీ’’ వంటి టీవీ షోల ద్వారా పాపులారిటీ పొందారు ఫ్రెడ్. ‘వాల్ – ఈ, యాంకర్ మేన్, ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ బ్లాక్’’ వంటి సినిమాల్లో నటించారాయన. ఫ్రెడ్ మరణం పట్ల పలువురు హాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment