అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దట్ సెవంటీస్ షో నటుడు డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. యువతులపై అత్యాచారానికి పాల్పడినందుకుగానూ అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా డానీ మాస్టర్‌సన్ 2001లో 23 ఏళ్ల యువతిపై, 2003లో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడగా, 2003 చివర్లో 23 ఏళ్ల మరో యువతిని ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు కేసులు నమోదయ్యాయి.
దీనిపై 2020 జూన్‌లో విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధించగా.. 3.3 మిలియన్ డాలర్లు చెల్లించి అదే రోజు జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా మరోమారు విచారణ జరగ్గా డానీ మాస్టర్‌సన్‌ను నిందితుడిగా తేల్చిన న్యాయస్థానం 30 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అయితే 2001, 2003లో అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాగా 2003 ఏడాది చివర్లో ఓ యువతిని హాలీవుడ్ హిల్స్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్న ఆరోపణలో మాత్రం ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలుస్తోంది.
న్యాయస్థానం తీర్పు ప్రకటించిన సమయంలో డానీ మౌనంగా ఉండిపోగా ఆయన భార్య, నటి బిజు ఫిలిప్స్ మాత్రం కోర్టులోనే బోరుమని ఏడ్చేసింది. ఇకపోతే లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా నెట్‌ఫ్లిక్స్ 2017లో ద రాంచ్ అనే కామెడీ షో నుంచి డానీ మాస్టర్‌సన్‌ను తొలగించింది
Comments
Please login to add a commentAdd a comment