వాషింగ్టన్: హాలీవుడ్ నటుడు, దర్శకుడు జేమ్స్ మోరొసినికి వింత సమస్య వచ్చి పడింది. ఆయన గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఆన్‌లైన్ వేదికగా 31 ఏళ్ల జేమ్స్ మోరొసినికి, బెక్కా అనే అమ్మాయికి పరిచయమైంది. అభిరుచులు, అలవాట్లు, ఆసక్తులు కలవడంతో వారి మధ్య స్నేహం చిగురించింది. స్నేహం కాస్తా ఆన్‌లైన్ డేటింగ్‌కు దారితీసింది. ఇలా కొన్ని రోజులు ఆ అమ్మాయితో మనోడు డేటింగ్, చాటింగ్ చేస్తూనే ఉన్నాడు.
ఈక్రమంలోనే తనకు సంబంధించిన చాలా విషయాలు ఆ అమ్మాయి చెప్తున్నవాటితో సరిపోలడంతో అతనికి డౌట్‌కొట్టింది. దీంతో మరింత లోతుగా ఆ యువతి బెక్కా వివరాలు తెలుసుకుని షాకయ్యాడు. అతడు ఆన్‌లైన్‌లో ఇన్నిరోజులూ డేటింగ్ చేస్తున్నది తన తండ్రితో అని తెలిసి బిక్కచచ్చిపోయాడు. అయితే, తన తండ్రి ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌తో అలా ఎందుకు చేశాడో తెలుసుకుని కుదుటపడ్డాడు.
(చదవండి: మార్లిన్ మన్రో చిత్రానికి భారీ ధర.. అక్షరాలా రూ.1521కోట్లా..!)
అమ్మాయిల పట్ల తన ప్రవర్తన ఎలా ఉంది. ఇతరులతో ఆన్‌లైన్ స్నేహాలు గట్రా చేసే క్రమంలో ఓవర్ చేస్తున్నాడా? అని తెలుసుకునేందుకే ఆయన అలా చేశాడని తెలిసింది. ఆన్‌లైన్ యుగంలో సైబర్ నేరాలకు కొదవే లేకుండా పోయింది. గుడ్డిగా నమ్మి మోసపోయినవారెందరో ఉన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల డిజిటల్ వ్యవహారాలపట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే కదా!
(చదవండి: అర్ధరాత్రి పరుగులు.. ఫేమస్ చేయొద్దంటూ దణ్ణం పెడుతున్నాడు!)
Comments
Please login to add a commentAdd a comment