లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటుడు నిక్ కార్డెరో కరోనా కారణంగా అసువులు బాశారు. వైరస్‌తో 90 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆదివారం ఆయన శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. 41 యేళ్ల నిక్ ఏప్రిల్ ప్రారంభంలో కరోనా బారిన పడ్డారు. దీంతో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్‌లో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో గత నెల అతని కుడికాలిలో రక్తం గడ్డం కట్టడంతో వైద్యులు ఆయన కాలును సైతం తీసేశారు. తాజాగా అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. కాగా అతనికి భార్య అమండ క్లూట్స్, ఏడాది వయసున్న ఎల్విస్ ఎడ్యుర్డో ఉన్నారు. ఆయన మరణాన్ని భార్య అమండ క్లూట్స్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది. "దేవుడు ఉండే స్వర్గానికి మరొకరు చేరుకున్నారు. నా ప్రియమైన భర్త నేడు ఉదయం చనిపోయాడు. అతడు ఈ లోకాన్ని వదిలిపెట్టే ముందు కుటుంబం అంతా ఎంతగానో ప్రార్థనలు చేశాం. (కరోనాతో హాలీవుడ్ నటుడు మృతి)
ప్రతీరోజు మిస్ అవుతూనే ఉంటాం
అయినప్పటికీ మమ్మల్ని వీడి వెళ్లిపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. కుమిలిపోతున్నాను. అతను లేకుండా జీవితాన్ని ఊహించలేకపోతున్నా. అతను మాకు వెలుగును విరజిమ్మే ఓ కాంతి పుంజం. అతను ప్రతి ఒక్కరికీ ఆప్త మిత్రుడు. అందరికీ సాయం చేయడానికి, మనసారా మాట్లాడటానికి ఎంతో ఇష్టపడేవాడు. అతను గొప్ప నటుడు, సంగీతకారుడు. ఒక భర్తగా, తండ్రిగా నిక్ తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఎల్విస్(కుమారుడు), నేను ప్రతీరోజు అతన్ని మిస్ అవుతూనే ఉంటాం" అని అమండ రాసుకొచ్చింది. కాగా కార్డిరో.. బుల్లెట్స్ ఓవర్ బ్రాడ్‌వే, రాక్ ఆఫ్ ఏజెస్, వెయిట్రస్, ఎ బ్రాంక్స్ టేల్ వంటి పలు చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై వచ్చే బ్లూ బ్లడ్స్, లా అండ్ ఆర్డర్: స‌్పెషల్ విక్టిమ్స్ యూనిట్, లిలీహ్యామర్ సిరీస్‌లోనూ కనిపించారు. (ఎందుకీ ఆత్మహత్యలు)
Comments
Please login to add a commentAdd a comment