
Priyanka Chopra Shares Her First Look Poster Of Matrix Resurrections Movie: బాలీవుడ్, హాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఆమె నటించిన తాజా హాలీవుడ్ చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'ది మ్యాట్రిక్స్' సిరీస్‌లో వస్తోన్న నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్'. సినిమాలో ప్రియాంక పాత్ర ఎలా ఉండనుందో ఈ పోస్టర్‌లో చూపించారు. ఇందులో ప్రియాంక ఎరుపు రంగు ప్యాంటు, నలుపు బూట్లతో బ్లూ కలర్ టాప్ ధరించి ఉన్నారు. ఆమె హేయిర్ స్టైల్ కూడా డిఫరెంట్‌గా ఉంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో ఎప్పుడూ కనపడే నెంబర్ కోడ్స్ ఎరుపు, నీలం రంగుతో వేవ్స్ రూపంలో ఉండటం చూడొచ్చు. ఈ పోస్టర్‌ను ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేస్తూ 'ఆమె ఇక్కడ ఉంది. రీ-ఎంటర్' అంటూ రాసుకొచ్చింది.
చదవండి: ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్ కామెంట్
ఈ హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక ఎలా ఉండనుందో అని ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున‍్నారు. ఇటీవల ప్రియాంక షేర్ చేసిన 'ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్' థియేటర్ రిలీజ్ పోస్టర్‌లో కూడా తాను లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ప్రియాంక మీరెక్కడ' అని కూడా ఓ అభిమాని కామెంట్ చేశాడు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం మొదటి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అందులో ప్రియాంక కళ్లద్దాలు ధరించి రెప్పపాటు క్షణంలో కనిపిస్తారు. మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ నాలుగో సినిమాను లానా వాచోస్కీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెబంర్ 22న థియేటర్స్, హెచ్‌బీవో (HBO) మ్యాక్స్‌లో విడుదల కానుంది. నవంబర్ 22న ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్ ఫ్రొఫైల్‌లో పేరు మార్చిన సంగతి తెలిసిందే.
చదవండి: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment