ట్రంప్‌ నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు: నటుడి సంచలన ట్వీట్‌ | Donald Trump Beats My Wife Actor Alleges | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 24 2017 1:46 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Donald Trump Beats My Wife Actor Alleges - Sakshi - Sakshi - Sakshi

లండన్‌ : నటుడు బిల్లీ బాల్డ్‌విన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ పార్టీలో ట్రంప్‌ తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో అతన్ని తన భార్య గెంటేసిందని బెల్లీ తెలిపారు. 

డెమొక్రటిక్‌ పార్టీ సెనేటర్‌ అల్‌ ఫ్రాంకెన్‌పై లైంగిక ఆరోపణలు రాగా.. ట్రంప్‌ కొడుకు ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించాడు. ఆ వెంటనే బిల్లీ దానికి రీ-ట్వీట్‌ చేయటం విశేషం. మన్‌హట్టన్‌ హోటల్‌లో సుమారు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ బిల్లీ సందేశం ఉంచాడు. ‘లైంగిక దాడులలో మీ నాన్నకు(ట్రంప్‌ను ఉద్దేశించి) బ్లాక్‌ బెల్ట్‌ ఇవ్వొచ్చు.  ప్లాజా హోటల్‌లో ఓసారి నేను ఇచ్చిన పార్టీకి పిలవకపోయినా మీ నాన్న వచ్చాడు. నా భార్యతో లైంగికంగా ప్రవర్తించాడు. తన హెలికాప్టర్‌లో అట్లాంటాకు రావాలంటు పిలిచాడు.. అంటూ మరింత సమాచారంతో ఓ ట్వీట్‌ చేశాడు. 

54 ఏళ్ల బిల్లీ చైన్నా ఫిలిప్స్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ట్రంప్‌తో స్నేహంగా ఉన్నప్పటికీ.. తర్వాత ఎందుకనో వారిద్దరి మధ్య వైరం మొదలైంది.  అధ్యక్ష ఎన్నిక ప్రచారం నుంచే బిల్లీ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ఇక బిల్లీ సోదరుడు, నటుడు అయిన అలెక్‌ బాల్డ్‌విన్‌ కూడా  ట్రంప్‌ మీద ఓ సెటైరిక్‌ టీవీ షో నిర్వహిస్తున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement