ఆ హీరోయిన్‌ అంటే క్రష్‌, కానీ నరకం కనిపించింది: హాలీవుడ్‌ స్టార్‌ | Jake Gyllenhaal Reveals Filming Love Scenes With Jennifer Aniston Was Torture | Sakshi
Sakshi News home page

Jennifer Aniston: ఆ హీరోయిన్‌తో లవ్‌ సీన్లు నరకమే అంటున్న హీరో

Published Thu, Oct 7 2021 8:12 PM | Last Updated on Thu, Oct 7 2021 10:06 PM

Jake Gyllenhaal Reveals Filming Love Scenes With Jennifer Aniston Was Torture - Sakshi

టాప్‌ హీరోయిన్‌ జెన్నిఫర్‌ అనిస్టన్‌తో పని చేయడం నరకమని చెప్తున్నాడు హాలీవుడ్‌ స్టార్‌ జేక్‌ గైలెన్హల్‌. వీరిద్దరూ 2002లో వచ్చిన 'ద గుడ్‌ గర్ల్‌' అనే సినిమాలో కలిసి నటించారు. తాజాగా హోవార్డ్‌ స్టెర్న్‌ షోకు హాజరైన జేక్‌ ఆనాటి సినిమా విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. జెన్నిఫర్‌తో కలిసి పని చేయడం టార్చర్‌ అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఆమె అంటే ఎంతో ఇష్టం ఉన్న అతడికి తనతో లవ్‌ సీన్లలో నటించడం కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఉండేదన్నాడు.

పైగా సెట్స్‌లో 30 నుంచి 50 మంది వరకు మనల్ని చూస్తున్నప్పుడు ప్రేమ సన్నివేశాల్లో నటించడం ఇబ్బందిగా ఉండేదని తెలిపాడు. అయితే అప్పుడు పిల్లో టెక్నిక్‌తో కొన్ని అభ్యంతరకరమైన సీన్లను ఎలాగోలా షూట్‌ చేశామని పేర్కొన్నాడు. మా ఇద్దరి మధ్యలో దిండు పెట్టాలన్న ఐడియా కూడా జెన్నిఫర్‌దేనంటూ ఆమెకే క్రెడిట్‌ ఇచ్చాడు. కాగా జేక్‌.. జెన్నిఫర్‌ అంటే క్రష్‌ ఉందన్న విషయాన్ని 2016లో బయటపెట్టాడు. కొన్నేళ్లపాటు ఆమెను క్రష్‌గా ఆరాధించడమే కాక ఆమెతో కలిసి పనిచేసే అవకాశాన్ని కూడా కొట్టేశాడు.

ఇదిలా వుంటే జెన్నిఫర్‌ ఆనిస్టన్‌.. 2000వ సంవత్సరంలో నటుడు బ్రాడ్‌ పిట్‌ను పెళ్లాడింది. 2005లో అతడికి విడాకులిచ్చేసిన అనంతరం జస్టిన్‌ థెరూక్స్‌తో కొత్త జీవితాన్ని ఆరంభించింది. అయితే ఆమె గతంలో సంగీతకరారుడు జాన్‌ మేయర్‌, నటుడు విన్స్‌ వేగన్‌తో కూడా డేటింగ్‌ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement