విమాన ప్రమాదంలో హారిసన్ ఫోర్డ్‌కు తీవ్ర గాయాలు | Harrison Ford -- Plane Crashes ... Actor Seriously Injured | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదంలో హారిసన్ ఫోర్డ్‌కు తీవ్ర గాయాలు

Published Fri, Mar 6 2015 12:48 PM | Last Updated on Sat, Jun 30 2018 4:20 PM

విమాన ప్రమాదంలో హారిసన్ ఫోర్డ్‌కు తీవ్ర గాయాలు - Sakshi

విమాన ప్రమాదంలో హారిసన్ ఫోర్డ్‌కు తీవ్ర గాయాలు

ఇండియానా జోన్స్ సినిమా సిరీస్ ద్వారా హాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన అలనాటి హీరో హారిసన్ ఫోర్డ్ గురువారం నాడు ఓ విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన రెండు సీట్ల చిన్న విమానాన్ని స్వయంగా నడుపుకుంటూ వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. శాంటా మోనికా విమానాశ్రయానికి సమీపంలోని గోల్ఫ్‌కోర్టులో విమానం క్రాష్ ల్యాండింగ్ అవడం వల్ల హారిసన్ ఫోర్డ్ తలకు బలమైన గాయాలయ్యాయని లాస్ ఏంజెలిస్ అగ్నిమాపక దళం అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు. తమకు సమాచారం అంది... తాము ప్రమాద స్థలానికి చేరుకునేలోగానే కూలిపోయిన విమానం నుంచి ఫోర్డ్‌ను స్థానికులు బయటకు తీస్తూ కనిపించారని ఆయన వివరించారు.

అమెరికా నటుడైన హారిసన్ ఫోర్డ్ స్టార్ వార్స్ సిరీస్ ద్వారా హాలివుడ్‌లోకి ప్రవేశించారు. అపోకలిప్సీ నౌ, ది ఫుజిటివ్, బ్లేడ్ రన్నర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. విట్‌నెస్‌లో హీరోగా నటించిన ఫోర్డ్‌కు ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డును అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement