Harrison ford
-
చనిపోయిన నటి చివరి వింత కోరిక!
స్టార్ వార్స్ సినిమాలో నటించిన ప్రఖ్యాత హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ మంగళవారం ఉదయం గుండెపోటుతో తనువు చాలించింది. స్టార్‌వార్స్ ప్రిన్సెస్ లీయా ఆర్గానాగా నటించిన ఆమెకు 60 ఏళ్లు. ఆమెకు హారిసన్ ఫోర్డ్‌తోపాటు ఇతర స్టార్ వార్స్ సిరీస్ నటులు నివాళులర్పిస్తుండగా.. తాజాగా ఆమె చివరి వింత కోరిక ఒకటి వెలుగుచూసింది. 'వెన్నెల వెలుగులో మునిగి.. సొంత బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయింది' అని తన గురించి శ్రద్ధాంజలిలో రాయాలని కోరుకుంటున్నట్టు ఆమె పేర్కొంది. ఈ విషయాన్ని 2008లో తాను ప్రచురించిన ఆత్మకథ 'విష్‌ఫుల్ థింకింగ్'లో పేర్కొంది. 1997నాటి స్టార్‌వార్ సినిమాలో పిన్సెస్ లీయా పాత్ర అంతరిక్షంలో తెల్లని దుస్తులు ధరిస్తుంది. ఈ దుస్తులు ఎంతో ప్రసిద్ధి పొందాయి. అయితే, సినిమా దర్శకుడు జార్జ్ లుకాస్ ఈ దుస్తుల గురించి తనతో చర్చిస్తూ.. వీటిని వేసుకునేటప్పుడు లోదుస్తులు వేసుకోవద్దని, ఎందుకంటే అంతరిక్షంలో వాటిని వేసుకోబోరని చెప్పాడని తెలిపింది. 'ఈ డ్రెస్ వేసుకొనేటప్పుడు బ్రా ధరించవద్దని అతను చెప్పాడు. నిజమే అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు మీ శరీర బరువు తేలికైపోతుంది. అప్పుడు మీ శరీరం ఉబ్బిపోవొచ్చు. కానీ బ్రా అలా పెరిగిపోదు. అందుకే నేను ఎలా చనిపోయినా పర్వాలేదు కానీ, బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయిందని శ్రద్ధాంజలిలో రాయమని నా స్నేహితులకు చెప్పాను' అంటూ తన పుస్తకంలో సరదాగా వివరించింది ఫిషర్. -
హీరోయిన్‌కు ఘోర అవమానం!
లాస్ ఏంజెల్స్: జెన్నిఫర్ లారెన్స్.. ప్రస్తుతం ఈ పేరు హాలీవుడ్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. కానీ, నటుడు హ్యారీసన్ ఫోర్డ్ ఒకప్పుడు ఆమె ఎవరో కూడా గుర్తించలేదట. ఈ విషయాన్ని లారెన్స్ 'గ్రాహం నోర్టాన్ షో' లో బయటపెట్టింది. బ్రిటిష్ కమెడియన్ జాక్ వైట్ హాల్‌తో బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఆ ఘటన అనంతరం ఫోర్డ్, స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకన్ జేజే అబ్రమ్స్ తో కలిసి డాన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు లారెన్స్ వివరించింది. తాను అందరూ తనను గుర్తించాలని కోరుకోనని.. కానీ ఫోర్డ్, అబ్రమ్స్ కూడా తనను గుర్తించలేకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించానని తెలిపింది. దాంతో వారివద్దకు వెళ్లి ఏం చేస్తున్నానో కూడా అర్ధం కాకుండా డాన్స్ చేసినట్లు వివరించింది. ఆ తర్వాత తనకే చాలా ఇబ్బందిగా అనిపించినట్లు తెలిపిందీ హీరోయిన్. ప్రస్తుతం 'ది హంగర్ గేమ్స్: మాకింగ్ జే- పార్ట్-1' లో నటిస్తోంది. -
అత్యధిక వసూళ్లు హీరో అతడే!
న్యూయార్క్: హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ అరుదైన ఘనత సాధించాడు. హాలీవుడ్ చరిత్రలో హయ్యస్ట్ గ్రాసింగ్ నటుడిగా నిలిచాడు. 73 ఏళ్ల హారిసన్ నటించిన 41 సినిమాలు రూ. 3 లక్షల కోట్ల పైచిలుకు వసూలు చేశాయి. ఈ సినిమాల మొత్తం వసూళ్లు 4.7 బిలియన్ డాలర్లుగా తేలింది. తాజా చిత్రం 'స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకన్' కలెక్షన్స్ వర్షం కురిపిస్తుండడంతో హారీసన్ హయ్యస్ట్ గ్రాసింగ్ నటుడిగా ఖ్యాతికెక్కాడు. ఈ సినిమా ఇప్పటికే 770 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు హయ్యస్ట్ గ్రాసింగ్ నటుడిగా ఉన్న 67 ఏళ్ల శామ్యుల్ ఎల్ జాక్సన్ రెండో స్థానానికి పడిపోయాడు. అతడు నటించిన 68 సినిమాల మొత్తం వసూళ్లు 4.6 బిలియన్ డాలర్లు. టామ్ హాంక్స్, మోర్గాన్ ఫ్రీమాన్, ఎడీ మార్ఫీ లాంటి నటులు టాప్ ఫైవ్ నుంచి పడిపోయారు. -
జూలై13 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: హ్యారిసన్ ఫోర్డ్ (హాలీవుడ్ నటుడు), మాస్టర్ సలీమ్ (బాలీవుడ్ గాయకుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది రవికి సంబంధించినది కావడం వల్ల ఈ సంవత్సరం వీరి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. కొత్త ఉత్సాహం, దేనినైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం కలుగుతాయి. అనూహ్యంగా, అప్రయత్నంగా అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. కొత్త టెక్నాలజీ తెలుసుకుంటారు. మీ టెక్నాలజీని మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉపయోగించి, లాభపడతారు. అవివాహితులకు వివాహం అవుతుంది. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు పుట్టిన తేదీ 13 రాహువుకు సంబంధించినది కావడం వల్ల కంప్యూటర్ రంగంలోని వారికి, ఎం.బి.ఎ; సి.ఎ; ఎల్.ఎల్.బి చదివిన వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. పోటీపరీక్షల్లో విజయం ప్రాప్తిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి బాగా కలిసి వస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అయితే అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆవేశంగా మాట్లాడటం వల్ల నష్టపోతారు. లక్కీ నంబర్స్: 1,4,5, 6; లక్కీ కలర్స్: వయోలెట్, క్రీమ్, గోల్డెన్, రెడ్, శాండల్; లక్కీ డేస్: శుక్ర, ఆది, సోమవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. దుర్గాదేవిని ఆరాధించడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం లేదా వినడం, పేదవితంతువులకు సాయం చేయడం, వీధికుక్కలకు రొట్టెలు తినిపించడం మంచిది. - డాక్టర్ ముహ్మద్ దావూద్ -
రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో
హాలీవుడ్ ప్రముఖ నటుడు 72 ఏళ్ల హారిసన్ ఫోర్డ్ వెండితెర మీదే కాదు.. నిజజీవితంలో కూడా హీరోగానే ఉన్నారు. గురువారం ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానంలో ఇంజన్ పనిచేయక అత్యవసరంగా దాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా చాకచక్యంగా దాన్ని గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించి పరోక్షంగా ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడారు. స్టార్ వార్స్ సిరీస్ సినిమాల్లో, ఎయిర్‌ఫోర్స్ వన్ సినిమాలో స్వయంగా స్టంట్లు చేసిన హారిసన్ ఫోర్డ్ మంచి నైపుణ్యం గల పైలట్. ఆయన రెండో ప్రపంచయుద్ధం కాలం నాటికి చెందిన సింగిల్ ఇంజన్ గల చిన్న వింటేజ్ విమానంలో గురువారం నాడు విహారయాత్రకు వెళ్లాడు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో గగనతలంలో విహరిస్తుండగా హఠాత్తుగా అందులోని ఇంజన్ చెడిపోయింది. ఏ మాత్రం కంగారు పడకుండా దగ్గరలో ఉన్న శాంటా మోనికా విమానాశ్రయం వైపు విమానాన్ని మళ్లించారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం కోసం విమానాశ్రయం అధికారులను కోరారు. వారు అందుకు అనుమతించినా విమానాశ్రయం రన్‌వేకు చేరుకోలేకపోయారు. సమీపంలో ఉన్న జనావాస ప్రాంతాల వైపు వెళ్లకుండా విమానాన్ని ఆ పక్కనే ఉన్న కాలిఫోర్నియా గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించారు. అక్కడ కూడా భారీ చెట్లను తప్పించుకొని అత్యంత చాకచక్యంగా విమానాన్ని క్రాష్‌ల్యాండింగ్ చేశారు. విమానం జనావాస ప్రాంతాల వైపు వెళ్లకుండా ఉండేందుకు విమానాన్ని ఏకంగా 180 డిగ్రీల కోణంలో గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించడం సాహసోపేతమైన చర్యను ప్రమాదస్థలాన్ని సందర్శించిన విమానయాన నిపుణుడు రిక్ డేక్ తెలిపారు. చెట్లకు తగలకుండా అతి జాగ్రత్తగా విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయడం, అందులో 72 ఏళ్ల వయసులో అలా చేయడం మామూలు విషయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగిలి ఉక్లా మెడికల్ సెంటర్ ఆస్పత్రిలో చేరిన ఫోర్డ్‌కు ప్రాణాపాయం లేదని ఆయన కుమారుడు బెక్ ఫోర్డ్ తెలిపారు. 1966లోనే పైలట్ లైసెన్స్ పొందిన ఫోర్డ్ ఇంతకుముందు కూడా నిజ జీవితంలో పలు సాహసాలు చేశారు. 2000 సంవత్సరంలో టెటాన్ కౌంటీ (అమెరికా)లోని ఇడాహో ఫాల్స్ వద్ద గల పర్వతాల్లో 11,106 అడుగు ఎత్తులో చిక్కుకున్న ఓ మహిళా పర్వతారోహకురాలిని ప్రాణాలకు తెగించి అక్కడికి తన విమానంలో వెళ్లి ఆమెను రక్షించారు. ఆ తర్వాత 2001 సంవత్సరంలో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడవుల్లో తప్పిపోయిన బాలుడిని సాహసోపేతంగా రక్షించి తీసుకొచ్చారు. గతేడాది స్టార్‌వార్స్ ఏడో ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా మిలీనియం ఫెలికాన్ స్పేస్‌క్రాఫ్ట్ తలుపు విరిగిపడడంతో ఫోర్డ్ కారు విరిగింది. కోలుకున్నాక ఆ షూటింగ్‌ను పూర్తి చేశారు. -
విమాన ప్రమాదంలో హారిసన్ ఫోర్డ్‌కు తీవ్ర గాయాలు
ఇండియానా జోన్స్ సినిమా సిరీస్ ద్వారా హాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన అలనాటి హీరో హారిసన్ ఫోర్డ్ గురువారం నాడు ఓ విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన రెండు సీట్ల చిన్న విమానాన్ని స్వయంగా నడుపుకుంటూ వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. శాంటా మోనికా విమానాశ్రయానికి సమీపంలోని గోల్ఫ్‌కోర్టులో విమానం క్రాష్ ల్యాండింగ్ అవడం వల్ల హారిసన్ ఫోర్డ్ తలకు బలమైన గాయాలయ్యాయని లాస్ ఏంజెలిస్ అగ్నిమాపక దళం అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు. తమకు సమాచారం అంది... తాము ప్రమాద స్థలానికి చేరుకునేలోగానే కూలిపోయిన విమానం నుంచి ఫోర్డ్‌ను స్థానికులు బయటకు తీస్తూ కనిపించారని ఆయన వివరించారు. అమెరికా నటుడైన హారిసన్ ఫోర్డ్ స్టార్ వార్స్ సిరీస్ ద్వారా హాలివుడ్‌లోకి ప్రవేశించారు. అపోకలిప్సీ నౌ, ది ఫుజిటివ్, బ్లేడ్ రన్నర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. విట్నెస్లో హీరోగా నటించిన ఫోర్డ్‌కు ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డును అందుకున్నారు.