చనిపోయిన నటి చివరి వింత కోరిక! | she wanted in her final obituary like this | Sakshi
Sakshi News home page

చనిపోయిన నటి చివరి వింత కోరిక!

Published Wed, Dec 28 2016 9:08 AM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM

చనిపోయిన నటి చివరి వింత కోరిక!

చనిపోయిన నటి చివరి వింత కోరిక!

స్టార్‌ వార్స్ సినిమాలో నటించిన ప్రఖ్యాత హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ మంగళవారం ఉదయం గుండెపోటుతో తనువు చాలించింది.  స్టార్‌వార్స్‌ ప్రిన్సెస్ లీయా ఆర్గానాగా నటించిన ఆమెకు 60 ఏళ్లు. ఆమెకు హారిసన్ ఫోర్డ్‌తోపాటు ఇతర స్టార్ వార్స్‌ సిరీస్‌ నటులు నివాళులర్పిస్తుండగా.. తాజాగా ఆమె చివరి వింత కోరిక ఒకటి వెలుగుచూసింది.

'వెన్నెల వెలుగులో మునిగి.. సొంత బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయింది' అని తన గురించి శ్రద్ధాంజలిలో రాయాలని కోరుకుంటున్నట్టు ఆమె పేర్కొంది. ఈ విషయాన్ని 2008లో తాను ప్రచురించిన ఆత్మకథ 'విష్‌ఫుల్ థింకింగ్'లో పేర్కొంది. 1997నాటి స్టార్‌వార్‌ సినిమాలో పిన్సెస్‌ లీయా పాత్ర అంతరిక్షంలో తెల్లని దుస్తులు ధరిస్తుంది. ఈ దుస్తులు ఎంతో ప్రసిద్ధి పొందాయి. అయితే, సినిమా దర్శకుడు జార్జ్ లుకాస్‌ ఈ దుస్తుల గురించి తనతో చర్చిస్తూ.. వీటిని వేసుకునేటప్పుడు లోదుస్తులు వేసుకోవద్దని, ఎందుకంటే అంతరిక్షంలో వాటిని వేసుకోబోరని చెప్పాడని తెలిపింది. 'ఈ డ్రెస్‌ వేసుకొనేటప్పుడు బ్రా ధరించవద్దని అతను చెప్పాడు. నిజమే అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు మీ శరీర బరువు తేలికైపోతుంది. అప్పుడు మీ శరీరం ఉబ్బిపోవొచ్చు. కానీ బ్రా అలా పెరిగిపోదు. అందుకే నేను ఎలా చనిపోయినా పర్వాలేదు కానీ, బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయిందని శ్రద్ధాంజలిలో రాయమని నా స్నేహితులకు చెప్పాను' అంటూ తన పుస్తకంలో సరదాగా వివరించింది ఫిషర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement