పక్కన చిత్రం చూస్తుంటే... స్టార్‌వార్స్‌లో వాకింగ్ కార్ (ఆల్ టెరైన్ ఆర్మర్డ్ ట్రాన్స్‌పోర్ట్) నేరుగా నడిచొస్తున్నట్టు ఉంది కదూ. ఇది అలాంటి కారే.. కానీ నిజమైనది. దీనిని తయారు చేయడానికి సిద్ధమవుతోంది ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్. స్టార్‌వార్స్‌లో సెల్యులాయిడ్‌పై కనిపించిన నడిచేకారును నేలమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. 2019లో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఆ కారు డిజైన్స్‌ను ప్రదర్శించిన ఆ సంస్థ... తయారీకోసం దాదాపు రూ.154 కోట్లతో మోంటానాలో అభివృద్ధి కేంద్రం (న్యూ హారిజాన్ స్టూడియో)ని ఇటీవలే ఏర్పాటు చేసింది.
ఆ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఎలాంటి ఉపరితలం మీదైనా ఇట్టే ప్రయాణించగలదు. మెట్లను సులభంగా ఎక్కగలిగే ఈ కారును ట్యాక్సీలా వాడితే.. వీల్‌చైర్ ఉపయోగించే వారు సులభంగా ట్రావెల్ చేయొచ్చు. భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడినుంచి గాయపడినవారిని తరలించడం కష్టమవుతుంది. అలాంటప్పుడు ఇది అంబులెన్స్‌లా పనిచేస్తుంది. రాళ్లు రప్పలు, గుట్టలు, మంచు గడ్డలు... ఉపరితలాన్ని బట్టి మోడ్‌ను మార్చుకుంటుంది. ఉన్నపళంగా ఏ దిశలోనైనా పోగలగడం దీని ప్రత్యేకత. అయితే... ఈ కారు ప్రజలకు అందుబాటులోకి వస్తుందా? రాదా? ధర ఎంత? అనే విషయాలేవీ ఈ సంస్థ ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment