seriously injured
-
అగ్ని గుండంలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
విడపనకల్లు: అగ్ని గుండంలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని పొలికి గ్రామంలో జరిగింది. వివరాలు.. పొలికి గ్రామంలో చిన్న సరిగెత్తు సందర్భంగా సోమవారం తెల్లవారుజామున పీర్ల దేవుళ్లను ఊరేగించారు.గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ పీర్ల దేవున్ని ఎత్తుకుని అగ్ని గుండం దాటే క్రమంలో అకస్మాత్తుగా పడిపోయాడు. స్థానికులు వెంటనే అగ్ని గుండంలో నుంచి లక్ష్మీనారాయణను బయటకు లాగారు.అప్పటికే ఆయన కాళ్లు, చేతులు తీవ్రంగా కాలి గాయాలయ్యాయి. వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు. -
భవనం కూలి ఇద్దరు మృతి.. మరొకని పరిస్థితి విషమం!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలోని కబీర్ నగర్లో బుధవారం అర్ధరాత్రి 2:16 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన భవనంలో మొదటి అంతస్తులో ఎవరూ నివసించడంలేదు. గ్రౌండ్ ఫ్లోర్లో జీన్స్ కటింగ్ పనులు జరుగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. వీరిలోని ఇద్దరు జీటీబీ ఆసుపత్రిలో మృతి చెందారు. ఒక కూలీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భవనం యజమాని షాహిద్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. షాహిద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. #WATCH | Delhi: At around 2:16 am, a call was received regarding the collapse of a two-storey, old construction building in Kabir Nagar, Welcome. Two workers Arshad (30) and Tauhid (20) were declared dead at GTB Hospital while another worker Rehan (22) is critical and is being… pic.twitter.com/2Zjw6WmgMo — ANI (@ANI) March 21, 2024 -
మానవత్వం చాటిన గూడూరు సబ్‌కలెక్టర్
సాక్షి, నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైవే పక్కన నిస్సహాయ స్థితిలో పడిఉన్న ఓ మహిళను అదే మార్గంలో వస్తున్న గూడూరు సబ్‌కలెక్టర్ గోపాలకృష్ణ గమనించి తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన మనుబోలు మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..ఇందుకూరుపేటకు చెందిన ఇటుకల ప్రసన్న తన తమ్ముడు చందుతో కలిసి మోటార్‌బైక్‌పై గూడూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో మనుబోలు పోలీస్‌స్టేషన్ సమీపంలో మోటారుసైకిల్‌పై వెనకగా కూర్చుని ఉన్న ప్రసన్న అదుపుతప్పి కింద పడిపోయింది. ఇది గమనించని సోదరుడు ముందుకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత అదే మార్గంలో నెల్లూరు నుంచి గూడూరు వస్తున్న సబ్‌కలెక్టర్ గోపాలకృష్ణ హైవే పక్కన పడిపోయి ఉన్న ప్రసన్నని గమనించి వాహనం ఆపారు. గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ప్రసన్నను తన సిబ్బంది సాయంతో వాహనంలో మనుబోలు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో సబ్‌కలెక్టర్ నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వెంటనే మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించేలా చర్యలు తీసుకున్నారు. అంతకుముందే సమాచారం అందుకున్న తమ్ముడు పీహెచ్‌సీకి చేరుకుని అక్క వెంట వెళ్లాడు. కళ్ల ముందే ప్రమాదం జరిగినా మనకెందుకులే అని చేతులు దులుపుకొని వెళ్లే రోజుల్లో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్న సబ్‌కలెక్టర్‌ను పలువురు అభినందించారు. -
ఫోటో క్లిక్ చేయబోయి.. ట్రిగ్గర్ నొక్కాడు
పటాన్ కోట్: సెల్ఫీల పిచ్చి రోజురోజుకు పరాకాష్టకు చేరుకుంటుంది. వినూత్నంగా సెల్ఫీ దిగాలనే ఓ అనాలోచిత ప్రయత్నం పంజాబ్ లోని పటాన్ కోట్ లోని ఓ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పాయింట్ బ్లాంక్ లో గన్ ను పెట్టుకొని సెల్ఫీ తీసుకోవాలనుకున్న అతని ప్రయత్నం బెడిసికొట్టింది. సెల్ఫీ క్లిక్ మనిపించే సమయంలో గన్ ట్రిగ్గర్ నొక్కడంతో బాలుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. -
పెళ్లింట విషాదం, చిన్నారి మృతి
పట్నా: బిహార్ లో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. అర్రా గ్రామంలోని పెళ్లి వేడుకల్లో జరిగిన ప్రమాదం ఓ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. వివాహ ఊరేగింపులో ఉపయోగించిన బాణా సంచా పేలుడులో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఒక చిన్నారి చనిపోగా, మరికొంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలోఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో స్థానికంగా ఆందోళన చెలరేగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
విమాన ప్రమాదంలో హారిసన్ ఫోర్డ్‌కు తీవ్ర గాయాలు
ఇండియానా జోన్స్ సినిమా సిరీస్ ద్వారా హాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన అలనాటి హీరో హారిసన్ ఫోర్డ్ గురువారం నాడు ఓ విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన రెండు సీట్ల చిన్న విమానాన్ని స్వయంగా నడుపుకుంటూ వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. శాంటా మోనికా విమానాశ్రయానికి సమీపంలోని గోల్ఫ్‌కోర్టులో విమానం క్రాష్ ల్యాండింగ్ అవడం వల్ల హారిసన్ ఫోర్డ్ తలకు బలమైన గాయాలయ్యాయని లాస్ ఏంజెలిస్ అగ్నిమాపక దళం అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు. తమకు సమాచారం అంది... తాము ప్రమాద స్థలానికి చేరుకునేలోగానే కూలిపోయిన విమానం నుంచి ఫోర్డ్‌ను స్థానికులు బయటకు తీస్తూ కనిపించారని ఆయన వివరించారు. అమెరికా నటుడైన హారిసన్ ఫోర్డ్ స్టార్ వార్స్ సిరీస్ ద్వారా హాలివుడ్‌లోకి ప్రవేశించారు. అపోకలిప్సీ నౌ, ది ఫుజిటివ్, బ్లేడ్ రన్నర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. విట్నెస్లో హీరోగా నటించిన ఫోర్డ్‌కు ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డును అందుకున్నారు.