
ఫైల్ ఫోటో
అగ్ని గుండంలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
కాలిన గాయాలతో ఆస్పత్రిలో బాధితుడు
విడపనకల్లు: అగ్ని గుండంలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని పొలికి గ్రామంలో జరిగింది. వివరాలు.. పొలికి గ్రామంలో చిన్న సరిగెత్తు సందర్భంగా సోమవారం తెల్లవారుజామున పీర్ల దేవుళ్లను ఊరేగించారు.
గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ పీర్ల దేవున్ని ఎత్తుకుని అగ్ని గుండం దాటే క్రమంలో అకస్మాత్తుగా పడిపోయాడు. స్థానికులు వెంటనే అగ్ని గుండంలో నుంచి లక్ష్మీనారాయణను బయటకు లాగారు.
అప్పటికే ఆయన కాళ్లు, చేతులు తీవ్రంగా కాలి గాయాలయ్యాయి. వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment