Stephen Laurel TWitch Boss Died By Suicide - Sakshi
Sakshi News home page

Stephen 'tWitch' Boss: ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ ఆత్మహత్య

Published Thu, Dec 15 2022 10:54 AM | Last Updated on Thu, Dec 15 2022 12:04 PM

Actor, Choreographer Dj Stephens Dead At 40 - Sakshi

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. అమెరికన్‌ హిప్‌హాప్‌ డ్యాన్స్‌, కొరియోగ్రాఫర్‌, నటుడు డీజే స్టీఫెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ హాటల్‌లో ఆయన గన్‌తో షూట్‌ చేసుకున్ని ఆత్మహత్య పాల్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. దీంతో హాలీవుడ్‌ నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా స్టీఫెన్‌ మృతికి సంతాపం తెలుపుతున్నారు. 

చదవండి: అనన్య ఫ్యాన్‌గర్ల్‌ మూమెంట్‌.. ‘ఆయన నాకు చేయి ఊపారు’

కాగా ది ఎలెన్‌ డిజనరేస్‌ షో, సో యూ థింక్‌ యూ కెన్‌ డాన్స్‌’ వంటి రియాలిటీ షోలతో స్టీఫెన్‌ పాపులర్‌ అయ్యాడు. స్టెప్‌ అప్‌, మ్యాజిక్‌ మైక్‌ డబుల్‌ ఎక్స్‌ సినిమాల్లో కూడా ఆయన నటించాడు. అలాగే టెలివిజన్‌ ప్రొడ్యూర్‌గా కూడా స్టీఫెన్‌ గుర్తింపు పొందాడు. కాగా స్టీఫెన్‌కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement