'ఆ హీరో నాపై 4 గంటలపాటు అత్యాచారం చేశాడు' | Hollywood Actor Armie Hammer Accused Of Sexually Assaulting a women | Sakshi
Sakshi News home page

హింసాత్మకంగా తలను గోడకు పదేపదే కొట్టి..

Published Fri, Mar 19 2021 4:20 PM | Last Updated on Fri, Mar 19 2021 9:12 PM

Hollywood Actor Armie Hammer Accused Of Sexually Assaulting a women - Sakshi

హాలీవుడ్‌ నటుడు ఆర్మీ హ్యామర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నటుడు హ్యూమర్‌ తనను శారీరకంగా, మానసికంగా ఎంతో హింసించాడని 24 ఏళ్ల ఎఫీ అనే మహిళ ఆరోపించింది. 2016లో ఫేస్‌బుక్‌ ద్వారా హ్యూమర్‌ని కలిసానని, అప్పటినుంచి తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 24, 2017న నటుడు ఆర్మీ హ్యూమర్‌ లాస్‌ఏంజిల్స్‌లో తనపై నాలుగు గంటల పాటు హింసాత్మకంగా అత్యాచారం చేశాడని, తన తలను పదేపదే గోడకు కొట్టేవాడని పేర్కొంది.

దీంతో తల, ముఖానికి బలంగా గాయాలైనట్లు మహిళ ఆరోపించింది. వీటిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించినట్లు తెలిపింది. కాగా ఎఫీ ఆరోపణల్ని నటుడు ఆర్మీ హ్యూమర్‌ ఖండించారు. ఎఫీతో పాటు ఇంతకుముందున్న సెక్సువల్‌ పార్టనర్స్‌ అందరితోనూ తన రిలేషన్‌ మ్యూచవల్ అగ్రిమెంట్‌ ప్రకారమే జరిగాయన్నాడు. డేటింగ్‌పై ముందుగానే చర్చించి,ఇరువురి ఏకాభిప్రాయం ఉన్నప్పుడే ముందుకు వెళ్లామని పేర్కొన్నాడు. 

అతను ఎమోషన్స్‌ని కంట్రోల్‌ చేసుకోలేడు : హ్యూమర్‌ మాజీ భార్య
కాగా 2010 ట్విన్స్‌ అనే రోల్‌ పోషించినందుకు గానూ  ఆర్మీ హ్యూమర్‌కి మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా 2013లో వచ్చిన లోస్‌ రేంజర్‌ సినిమాతో ఎంతో ప్రసిద్ధి చెందాడు. అయితే ఇటీవలి కాలంలో ఆర్మీ హ్యూహర్‌పై వస్తోన్న లైంగిక ఆరోపణలు అతని కెరీర్‌ను దెబ్బతీశాయని చెప్పొచ్చు. ఈ ఏడాది జనవరిలోనూ హ్యూమర్‌ తనను లైంగికంగా వేధించాడని ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించిన అతనితో చేసిన చాటింగ్‌ సంబాషణల్ని బహిర్గతం చేసి సంచలనం సృష్టించింది. అయితే వీటిని ఖండించిన హ్యూమర్‌...ఇవి తనపై జరుగుతున్న ఆన్‌లైన్‌ దాడులని కొట్టిపారేశాడు. కాగా 2020 జూలైలో భార్య ఎలిజబెత్‌ చాంబర్స్‌తో హ్యూమర్‌కు విడాకులు అయిన సంగతి తెలిసిందే. తనను తాను కంట్రోల్‌ చేసుకోలేని ఎమోషన్స్‌ హ్యామర్‌లో ఉన్నాయని, అందుకే తన నుంచి విడిపోతున్నట్లు అతని భార్య ప్రకటించింది. 

చదవండి : మత్తుమందు కలిపి నాతో తాగించారు : హీరోయిన్‌
నా భర్త వేధించాడు, పిల్లలే సాక్ష్యం: ప్రముఖ‌ నటి‌‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement