assaults on women
-
బీచ్‌లో దారుణం: ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. యువతిని తోటలోకి లాక్కెళ్లి..
కోనేరుసెంటర్(మచిలీపట్నం)/కృష్ణా జిల్లా: ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన విద్యార్థినిపై మరొక వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. బందరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన ఓ యువతి నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. మరో కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇరువురు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు కలిసి బందరు మండలం చినకరగ్రహారం శివారు పల్లెపాలెం సమీపంలోని బీచ్‌కు వెళ్లారు. చదవండి: వివాహేతర సంబంధం: వద్దన్నా వినకుండా.. ఆమె ఇంటివద్దకెళ్లి.. బీచ్ ఒడ్డున ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటుండగా కరగ్రహారానికి చెందిన యర్రంశెట్టి మణిదీప్, పోసిన నాగబాబు వారి వద్దకు వెళ్లారు. ప్రియుడిని మణిదీప్ తాళ్లతో కట్టివేయగా పోసిన నాగబాబు విద్యార్థినిని బలవంతంగా తోటలోకి లాక్కెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం వారు ఇరువురిని వదిలేశారు. జరిగిన ఘోరాన్ని తలచుకుంటూ ప్రేమికులిద్దరూ ఇంటికి వెళ్లారు. ప్రేమికులు ఇద్దరు వారి పెద్దలకు చెప్పకుండా గురువారం రాత్రి బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. -
'ఆ హీరో నాపై 4 గంటలపాటు అత్యాచారం చేశాడు'
హాలీవుడ్ నటుడు ఆర్మీ హ్యామర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నటుడు హ్యూమర్ తనను శారీరకంగా, మానసికంగా ఎంతో హింసించాడని 24 ఏళ్ల ఎఫీ అనే మహిళ ఆరోపించింది. 2016లో ఫేస్బుక్ ద్వారా హ్యూమర్‌ని కలిసానని, అప్పటినుంచి తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఏప్రిల్ 24, 2017న నటుడు ఆర్మీ హ్యూమర్ లాస్ఏంజిల్స్లో తనపై నాలుగు గంటల పాటు హింసాత్మకంగా అత్యాచారం చేశాడని, తన తలను పదేపదే గోడకు కొట్టేవాడని పేర్కొంది. దీంతో తల, ముఖానికి బలంగా గాయాలైనట్లు మహిళ ఆరోపించింది. వీటిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించినట్లు తెలిపింది. కాగా ఎఫీ ఆరోపణల్ని నటుడు ఆర్మీ హ్యూమర్ ఖండించారు. ఎఫీతో పాటు ఇంతకుముందున్న సెక్సువల్ పార్టనర్స్ అందరితోనూ తన రిలేషన్ మ్యూచవల్ అగ్రిమెంట్ ప్రకారమే జరిగాయన్నాడు. డేటింగ్‌పై ముందుగానే చర్చించి,ఇరువురి ఏకాభిప్రాయం ఉన్నప్పుడే ముందుకు వెళ్లామని పేర్కొన్నాడు. అతను ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేడు : హ్యూమర్ మాజీ భార్య కాగా 2010 ట్విన్స్ అనే రోల్ పోషించినందుకు గానూ ఆర్మీ హ్యూమర్‌కి మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా 2013లో వచ్చిన లోస్ రేంజర్ సినిమాతో ఎంతో ప్రసిద్ధి చెందాడు. అయితే ఇటీవలి కాలంలో ఆర్మీ హ్యూహర్పై వస్తోన్న లైంగిక ఆరోపణలు అతని కెరీర్‌ను దెబ్బతీశాయని చెప్పొచ్చు. ఈ ఏడాది జనవరిలోనూ హ్యూమర్ తనను లైంగికంగా వేధించాడని ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అతనితో చేసిన చాటింగ్ సంబాషణల్ని బహిర్గతం చేసి సంచలనం సృష్టించింది. అయితే వీటిని ఖండించిన హ్యూమర్...ఇవి తనపై జరుగుతున్న ఆన్లైన్ దాడులని కొట్టిపారేశాడు. కాగా 2020 జూలైలో భార్య ఎలిజబెత్ చాంబర్స్‌తో హ్యూమర్‌కు విడాకులు అయిన సంగతి తెలిసిందే. తనను తాను కంట్రోల్ చేసుకోలేని ఎమోషన్స్ హ్యామర్‌లో ఉన్నాయని, అందుకే తన నుంచి విడిపోతున్నట్లు అతని భార్య ప్రకటించింది. చదవండి : మత్తుమందు కలిపి నాతో తాగించారు : హీరోయిన్ నా భర్త వేధించాడు, పిల్లలే సాక్ష్యం: ప్రముఖ నటి -
ఈ డాక్టర్ తీరు అసభ్యకరం
ప్రొద్దుటూరు క్రైం : వైద్య పరీక్షల పేరుతో తమ పట్ల డాక్టర్ సాయిప్రసాద్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని మౌలానా ఆజాద్ వీధులకు చెందిన మహిళలు ఆరోపించారు. బుధవారం పలువురు మహిళలు మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లాతో కలసి ఆస్పత్రి వద్దకు వెళ్లారు. డాక్టర్ తీరును నిరసిస్తూ మహిళలు ఆయన పనిచేస్తున్న వసంతపేట అర్బన్ హెల్త్ సెంటర్ ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ముఖంపై కప్పుకున్న నఖాబ్ (ముసుగు)ను తీయమని చెబుతాడని, స్టెతస్కోప్‌తో పరీక్షించే క్రమంలో అనవసరంగా శరీర భాగాలను తడుముతాడని మహిళలు ఆరోపిస్తున్నారు. మహిళలతో వారి భర్తలు కూడా వచ్చి ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. డాక్టర్‌ను వెంటనే తొలగించి మహిళా వైద్యురాలిని నియమించాలని వారు డిమాండు చేశారు. కొందరైతే నేరుగా డాక్టర్ వద్దకు వెళ్లి నిలదీశారు. నాకు అలాంటి అవసరం లేదు నేను చాలా సీనియర్ డాక్టర్‌ను. మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నాను. మెడికల్ కాలేజి విద్యార్థులకు నైతిక విలువలను బోధిస్తున్నాను. ఈ వయసులో నాకు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఆస్పత్రికి వస్తున్న మహిళలు ఇంజక్షన్లు వేయాలని, యాంటిబయాటిక్స్ టాబ్లెట్స్ ఇవ్వాలని అడుగుతుం టారు. ఎక్కువగా ఇంజక్షన్లు, యాంటిబయాటిక్స్ వాడటం మంచిది కాదనే ఉద్దేశంతో వాటిని సిఫార్సు చేయను. ఈ ఉద్దేశంతోనే నాపై నిందలు వేస్తున్నారని డాక్టర్ వివరణ ఇచ్చారు. -
చెయ్యిచూస్తానని.. ఆస్ట్రేలియాలో వెకిలివేషాలు
రైళ్లలో వెళ్తుంటే ఎవరైనా మీ చెయ్యి చూసి హస్తసాముద్రికం చెబుతామన్నారా? ఇక్కడి సంగతి ఏమోగానీ, ఆస్ట్రేలియాలో మాత్రం ఓ భారతీయుడు ఇలాగే రైళ్లలో చేతులు చూస్తానంటూ వెకిలి వేషాలు వేశాడు. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాను రైళ్లలో ఇలా చేసిన మాట నిజమేనని, మరో ఇద్దరిపై అత్యాచారాలకు కూడా ప్రయత్నించానని అజయ్ చోప్రా అనే వ్యక్తి అంగీకరించాడు. దీంతో బెండిగో - మెల్బోర్న్ స్టేషన్ల మధ్య ప్రయాణించే రైళ్లలో అజయ్ చోప్రా అసలు ఎక్కడానికి వీల్లేదని అధికారులు ఆదేశించారు. 2011 సంవత్సరంలో అతడు 20-30 సంవత్సరాల మధ్య వయసున్న ఐదుగురు మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసు వివరాలేవీ మీడియాలో రాకుండా చూడాలని, అలా రావడం వల్ల తనకు చాలా ఇబ్బందిఆ ఉంటోందని అతడు కోర్టును కోరాడట. అయితే, బాధితుల పేర్లేవీ బయటకు రాలేదు కాబట్టి కథనాలను ఆపాల్సిన అసవరం ఏమీ లేదని జడ్జి గెరార్డ్ ముల్లే స్పష్టం చేశారు. చోప్రాకు బెయిల్ ఇచ్చినా, పాస్‌పోర్టు స్వాధీనం చేయాలని, వారానికి రెండుసార్లు పోలీసుల వద్ద హాజరు వేయించుకోవాలని, ఆస్ట్రేలియా వదిలి వెళ్లకూడదని నిబంధనలు విధించారు.