రైళ్లలో వెళ్తుంటే ఎవరైనా మీ చెయ్యి చూసి హస్తసాముద్రికం చెబుతామన్నారా? ఇక్కడి సంగతి ఏమోగానీ, ఆస్ట్రేలియాలో మాత్రం ఓ భారతీయుడు ఇలాగే రైళ్లలో చేతులు చూస్తానంటూ వెకిలి వేషాలు వేశాడు. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాను రైళ్లలో ఇలా చేసిన మాట నిజమేనని, మరో ఇద్దరిపై అత్యాచారాలకు కూడా ప్రయత్నించానని అజయ్ చోప్రా అనే వ్యక్తి అంగీకరించాడు. దీంతో బెండిగో - మెల్బోర్న్ స్టేషన్ల మధ్య ప్రయాణించే రైళ్లలో అజయ్ చోప్రా అసలు ఎక్కడానికి వీల్లేదని అధికారులు ఆదేశించారు.
2011 సంవత్సరంలో అతడు 20-30 సంవత్సరాల మధ్య వయసున్న ఐదుగురు మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసు వివరాలేవీ మీడియాలో రాకుండా చూడాలని, అలా రావడం వల్ల తనకు చాలా ఇబ్బందిఆ ఉంటోందని అతడు కోర్టును కోరాడట. అయితే, బాధితుల పేర్లేవీ బయటకు రాలేదు కాబట్టి కథనాలను ఆపాల్సిన అసవరం ఏమీ లేదని జడ్జి గెరార్డ్ ముల్లే స్పష్టం చేశారు. చోప్రాకు బెయిల్ ఇచ్చినా, పాస్పోర్టు స్వాధీనం చేయాలని, వారానికి రెండుసార్లు పోలీసుల వద్ద హాజరు వేయించుకోవాలని, ఆస్ట్రేలియా వదిలి వెళ్లకూడదని నిబంధనలు విధించారు.
చెయ్యిచూస్తానని.. ఆస్ట్రేలియాలో వెకిలివేషాలు
Published Thu, Mar 13 2014 8:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
Advertisement