palmistry
-
జ్యోతిష్యాన్ని నమ్మను కానీ.. బాహుబలి విజయం తర్వాత
Radhe Shyam Star Prabhas Said He Does Not Believing In palmistry: ప్రభాస్ లెటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రేరణ (పూజా హెగ్డే)తో ప్రేమలో పడి, ఆమెను రక్షించడానికి విధితో పోరాడే ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్ అలరించనున్న సంగతి తెలిసిందే. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రభాస్ అక్కడ పలు ఛానెల్స్‌కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. అయితే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్‌కు బయటకు చాలా విభిన్నంగా ఉంటానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. తాను జ్యోతిష్యాన్ని పెద్దగా నమ్మనని తెలిపాడు. 'నేను ఇవన్నీ నమ్మను. కానీ నేను నా స్నేహితుల నుంచి దీనికి సంబంధించిన స్టోరీలు విన్నాను. మన నాలెడ్జ్‌కు మించింది ఏదో ఉంటుందని మాత్రం నమ్ముతాను. కానీ నా చేతులు ఎవరికీ చూపించలేదు. అయితే బాహుబలి అద్భుతమైన విజయం తర్వాత నేను విధిని (డెస్టినీ), విశ్వాసాన్ని నమ్మడం ప్రారంభించాను. ఈ సినిమా తర్వాత నుంచి నేను హార్డ్ వర్కును మాత్రమే నమ్ముతున్నాను.' అని తెలిపాడు డార్లింగ్ ప్రభాస్. -
ఈ చేతిరేఖలు మీకున్నాయేమో చూసుకోండి!
హస్తవాసి మంచిగుండాలేగానీ పట్టిందల్లా బంగారం అంటుంటారు. 21 శతాబ్ధంలోకి అడుగుపెట్టినా, సాంకేతిక పరిజ్ఞానం కుప్పలుగా పుట్టుకొస్తున్నా నేటికి మనవాళ్లకు జాతకాలు పిచ్చి మాత్రం వదలదు. తప్పని అనకూడదు కానీ, జీవితంలో జాతకాలు చూపించుకోవడం ఒక సాంప్రదాయంగా ఉండిపోయింది. ఆపద సమయాల్లో, జరగకూడనివి జరుగుతున్నప్పుడు జాతకాలు బాగా గుర్తుకొస్తుంటాయి. ఆ సమయంలో సాధరణంగా జ్యోతిష్యులను ఆశ్రయిస్తుంటారు. అందులో ముఖం చూసి చెప్పేవారు, చేయి చూసి చెప్పేవారు, పుట్టిన సమయం ఆధారంగా జాతకం చెప్పేవారు ఇలా రకరకాలుగా ఉన్నారు. ముఖ్యంగా హస్త రేఖలు చూసి చెప్పే జాతకాలే సరైనవని ఎక్కువమంది నమ్ముతుంటారు. సాధారణంగా మన చేతిలో మూడు గీతలు ఉంటే అందులో వేళ్లకు దగ్గరగా ఉన్న మూడో గీతను హార్ట్ లైన్ అంటారు. ఈ హార్ట్ లైన్ ఆధారంగా ఎవరి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఈ క్రింద ఎ,బి,సి,డి కేటగిరీల్లో ఆ జాతక ఫలాల వివరాలు ఉన్నాయి. (ఎ) అర చేతిలోని మూడో గీత(హార్ట్ లైన్) మధ్య వేలుకు కొంచెం కింది నుంచి ప్రారంభమైతే మీరు నాయకుడిగా రాణిస్తారంట. మంచి లక్ష్యాన్ని కలిగిఉండటంతోపాటు స్వతంత్ర్యంగా వ్యవహరిస్తూ తెలివితో ముందుకెళతారట. అంతేకాదు నిర్ణయాలు కూడా స్వయంగా తీసుకొని విజయం సాధిస్తారంట. కొంచెం తక్కువ సున్నితత్వాన్ని కలిగి ఉండి ఇతరుల విషయంలో మాత్రం నిర్మలంగా వ్యవహరిస్తారంట. (బి) హార్ట్ లైన్ మధ్య వేలు చూపుడు వేలుకు మధ్యలో నుంచి ప్రారంభమైతే ఆ వ్యక్తులు దయగలవారై ఉంటారంట. ఎదుటవారు చెప్పిన అంశాలు పరిగణనలోకి తీసుకుంటారంట. మంచి సూచన ప్రాయంగా ఉంటారంట. తన తోటి వారు ఏవైన తప్పులు చేస్తే నిర్మొహమాటం లేకుండా హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. వారి మాటలు ఎదుటి వ్యక్తులు కూడా నమ్ముతారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తారు. (సి) చూపుడు వేలుకు కింద నుంచి హార్ట్ లైన్ స్టార్ట్ అయిన వ్యక్తులు (ఎ)లో కేటగిరిలో చెప్పినట్లుగా ఉంటారు. (డి) హార్ట్ లైన్ చూపుడు వేలకు బొటన వేలుకు మధ్య నుంచి ప్రారంభమైతే మంచి సహనం కలిగినవారిగా ఉండటంతోపాటు సంరక్షణ సామర్థ్యం కలిగి ఉంటారు. మంచి ఆలోచనలు కలిగి ఉండి సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. -
చెయ్యిచూస్తానని.. ఆస్ట్రేలియాలో వెకిలివేషాలు
రైళ్లలో వెళ్తుంటే ఎవరైనా మీ చెయ్యి చూసి హస్తసాముద్రికం చెబుతామన్నారా? ఇక్కడి సంగతి ఏమోగానీ, ఆస్ట్రేలియాలో మాత్రం ఓ భారతీయుడు ఇలాగే రైళ్లలో చేతులు చూస్తానంటూ వెకిలి వేషాలు వేశాడు. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాను రైళ్లలో ఇలా చేసిన మాట నిజమేనని, మరో ఇద్దరిపై అత్యాచారాలకు కూడా ప్రయత్నించానని అజయ్ చోప్రా అనే వ్యక్తి అంగీకరించాడు. దీంతో బెండిగో - మెల్బోర్న్ స్టేషన్ల మధ్య ప్రయాణించే రైళ్లలో అజయ్ చోప్రా అసలు ఎక్కడానికి వీల్లేదని అధికారులు ఆదేశించారు. 2011 సంవత్సరంలో అతడు 20-30 సంవత్సరాల మధ్య వయసున్న ఐదుగురు మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసు వివరాలేవీ మీడియాలో రాకుండా చూడాలని, అలా రావడం వల్ల తనకు చాలా ఇబ్బందిఆ ఉంటోందని అతడు కోర్టును కోరాడట. అయితే, బాధితుల పేర్లేవీ బయటకు రాలేదు కాబట్టి కథనాలను ఆపాల్సిన అసవరం ఏమీ లేదని జడ్జి గెరార్డ్ ముల్లే స్పష్టం చేశారు. చోప్రాకు బెయిల్ ఇచ్చినా, పాస్‌పోర్టు స్వాధీనం చేయాలని, వారానికి రెండుసార్లు పోలీసుల వద్ద హాజరు వేయించుకోవాలని, ఆస్ట్రేలియా వదిలి వెళ్లకూడదని నిబంధనలు విధించారు.