Radhe Shyam Star Prabhas Said He Does Not Believing In palmistry: ప్రభాస్ లెటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రేరణ (పూజా హెగ్డే)తో ప్రేమలో పడి, ఆమెను రక్షించడానికి విధితో పోరాడే ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్ అలరించనున్న సంగతి తెలిసిందే. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రభాస్ అక్కడ పలు ఛానెల్స్‌కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు డార్లింగ్ ప్రభాస్.
అయితే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్‌కు బయటకు చాలా విభిన్నంగా ఉంటానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. తాను జ్యోతిష్యాన్ని పెద్దగా నమ్మనని తెలిపాడు. 'నేను ఇవన్నీ నమ్మను. కానీ నేను నా స్నేహితుల నుంచి దీనికి సంబంధించిన స్టోరీలు విన్నాను. మన నాలెడ్జ్‌కు మించింది ఏదో ఉంటుందని మాత్రం నమ్ముతాను. కానీ నా చేతులు ఎవరికీ చూపించలేదు. అయితే బాహుబలి అద్భుతమైన విజయం తర్వాత నేను విధిని (డెస్టినీ), విశ్వాసాన్ని నమ్మడం ప్రారంభించాను. ఈ సినిమా తర్వాత నుంచి నేను హార్డ్ వర్కును మాత్రమే నమ్ముతున్నాను.' అని తెలిపాడు డార్లింగ్ ప్రభాస్.
Prabhas: జ్యోతిష్యాన్ని నమ్మను అంటున్న ప్రముఖ పామిస్ట్ విక్రమాదిత్య..
Published Sun, Mar 6 2022 7:26 PM | Last Updated on Sun, Mar 6 2022 9:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment