Prabhas Donated Two Lakh Rupees To Deceased Fan Family: పాన్ ఇండియా స్టార్, మనందరి డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన మంచి చాటుకున్నాడు. తన సినిమా విడుదల రోజు ప్రమాదవశాత్తు మరణించిన అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం అందించాడు. ప్రభాస్ తాజా చిత్రం 'రాధేశ్యామ్' మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్ థియేటర్ వద్ద 37 ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే ప్రభాస్ ఫ్యాన్ ఫ్లెక్సీ కడుతున్నాడు. అనుకోకుండా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు విద్యుదాఘాతానికి గురై చికిత్స పొందుతూ మృతిచెందాడు.
చదవండి: ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి.. అభిమానికి తీవ్ర గాయాలు
ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభాస్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇది తెలిసి చలించిపోయిన ప్రభాస్ చల్లా కోటేశ్వర రావు కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాడు. అలాగే ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు. కష్టాల్లో ఉన్న వారికి ప్రభాస్ తనవంతు సాయం ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఇదివరకు కేరళ, ఏపీ వరదల్లో చిక్కుకున్నప్పుడు ఆర్థిక సాయం అందించి ఉదారత చాటుకున్నాడు. ఈసారి తన అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం అందించి నిజమైన డార్లింగ్ అనిపించుకున్నాడు ఈ మిస్టర్ పర్‌ఫెక్ట్. కాగా ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ 'రాధేశ్యామ్' ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 వేలకుపైగా థియేటర్లలో విడుదలైంది.
చదవండి: రాదేశ్యామ్ సినిమా ఫ్లాప్ అయ్యిందని అభిమాని ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment