Hollywood Actor Al Pacino expecting fourth child at 83 - Sakshi
Sakshi News home page

29 ఏళ్ల ప్రేయసితో డేటింగ్‌.. 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రి కాబోతున్న నటుడు

Published Wed, May 31 2023 3:07 PM | Last Updated on Wed, May 31 2023 3:36 PM

Hollywood Actor Al Pacino will Welcome His Fourth Child at 83 - Sakshi

హాలీవుడ్‌ స్టార్‌, రెండుసార్లు ఆస్కార్‌ అందుకున్న హీరో రాబర్ట్‌ డి నిరో 79 ఏళ్ల వయసులో ఏడోసారి తండ్రైన విషయం తెలిసిందే కదా! తాజాగా ఇదే వయసులో ఉన్న మరో హాలీవుడ్‌ హీరో కూడా తండ్రి కాబోతున్నాడు. 83 ఏళ్ల వయసులో నాలుగోసారి డాడ్‌ అని పిలిపించుకోబోతున్నాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్‌ నోరెళ్లబెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అల్‌ పచినో 29 ఏళ్ల వయసున్న నూర్‌ అల్ఫల్లాతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు.

ఈ క్రమంలో గతేడాది ఆమె గర్భం దాల్చగా ప్రస్తుతం ఆమెకు ఎనిమిది నెలలు నిండినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సమయంలో అల్‌ పచినో తండ్రి కాబోతున్నాడన్న వార్త సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇకపోతే అల్‌ పచినో ఏప్రిల్‌లో 83వ పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

మూడు రిలేషన్స్‌- ముగ్గురు పిల్లలు
పెళ్లి అంటే ముఖం చాటేసే అల్‌ పచినో గతంలో ఇద్దరితో ప్రేమాయణాలు నడిపాడు. మొదటగా యాక్టింగ్‌ కోచ్‌ జన్‌ తరంత్‌తో డేటింగ్‌ చేయగా వీరికి 1989లో జూలీ పుట్టింది. ఆ తర్వాత నటి బెవర్లీ డియాంగిలోతో సహజీవనం చేయగా వీరికి ఆంటన్‌, ఒలీవియా కవలలు జన్మించారు. అయితే వీరి రిలేషన్‌ కూడా ఎంతో కాలం సాగలేదు. 1997-2003 మధ్యకాలంలోనే కలిసి ఉన్నారు, తర్వాత బ్రేకప్‌ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.

అనంతరం అల్‌.. నూర్‌ అల్ఫల్లాతో లవ్‌లో పడ్డాడు. అప్పటికే ఆమె మిక్‌ జాగర్‌, నికోలక్‌ బెరగ్రూన్‌లతో ప్రేమలో పడటం, బ్రేకప్‌ చెప్పడం కూడా అయిపోయింది. అంటే ఇద్దరికీ ఇది మూడో డేటింగే! ఎప్పుడూ ప్రేమ, సహజీవనం వరకే వచ్చి ఆగిపోయిన అల్‌ పచినో పెళ్లికి మాత్రం మొగ్గచూపలేదు. మరి ఈసారైనా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి!

సినిమాల విషయానికి వస్తే..
అల్‌ పచినో ప్రస్తుతం 'డేవిడ్‌ మామెట్స్‌ అసాసినేషన్‌' సినిమా చేస్తున్నాడు. యూఎస్‌ మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ హత్య ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షియా లేబఫ్‌, రెబెకా పిడ్జియాన్‌, కోర్ట్‌నీ లవ్‌ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రారంభం కానుంది.

చదవండి: కోపంతో నయనతారను రావద్దని చెప్పా: పార్థిబన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement