Breaking Bad Actor Mike Batayeh Died Of Hanging - Sakshi
Sakshi News home page

Mike Batayeh: కమెడియన్ మృతి.. ఆత్మహత్యగా నిర్ధారణ!

Jun 13 2023 2:44 PM | Updated on Jun 13 2023 3:22 PM

Breaking Bad Actor Mike Batayeh Died Of Hanging - Sakshi

'బ్రేకింగ్ బ్యాడ్' సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన హాస్యనటుడు మైక్ బటాయే  జూన్ 1న మరణించిన సంగతి తెలిసిందే. అతను మొదట గుండెపోటుతో చనిపోయాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. కానీ తాజాగా వైద్యాధికారులు ఇచ్చిన నివేదికలో అతను ఉరి వేసుకోవడం వల్ల మరణించాడని వెల్లడైంది. గతంలో కూడా ఆయన కుటుంబంలో ఎవరికీ కూడా గుండె జబ్బులు ఉన్నట్లు ఎలాంటి చరిత్ర లేదని తెలిసింది. కాగా.. జూన్ 1న మిచిగాన్‌లోని ఆయన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. నటుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న హాలీవుడ్ ప్రముఖులు షాక్‌కు గురవుతున్నారు.   

(ఇది చదవండి: స్మగ్లింగ్‌ వివాదంపై స్పందించిన 'జబర్దస్త్' హరి)

మైక్ బటాయే కెరీర్

మైక్ బటాయే సూపర్‌హిట్ సిరీస్  బ్రేకింగ్ బ్యాడ్‍లో మూడు ఎపిసోడ్‌లలో డెన్నిస్ మార్కోవ్స్కీగా కనిపించాడు. అంతేకాకుండా 'ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా,' 'స్లీపర్ సెల్,' 'ది బెర్నీ మాక్ షో,' 'బాయ్ మీట్స్ వరల్డ్,' 'ఎవ్రీబడీ లవ్స్ రేమండ్' వంటి షోలలో కూడా నటించాడు. వీటితో మైక్ బటాయే న్యూయార్క్ గోతం, లాస్ ఏంజిల్స్ లాఫ్ ఫ్యాక్టరీ, కామెడీ స్టోర్, ది ఇంప్రూవ్, ఐస్‌హౌస్ వంటి ప్రముఖ కామెడీ క్లబ్‌లలో కూడా ప్రదర్శన ఇచ్చాడు.

(ఇది చదవండి: 'సీతారామం' బ్యూటీకి బంపరాఫర్‌.. ఈసారి ఏకంగా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement