
వాషింగ్టన్: అమెరికన్ సూపర్‌హీరో టెలివిజన్ సిరీస్ ‘ది ష్లాష్’ నటుడు లాగాన్ విలియమ్స్ హఠాన్మరణం చెందాడు. ఈ విషయాన్ని అతడి తల్లి ధ్రువీకరించారు. అదే విధంగా విలియమ్స్ ఏజెంట్ మిచెల్లీ గౌవిన్ ఇందుకు సంబంధించిన ప్రకటన గురువారం విడుదల చేశారు. విలియమ్స్ ఆకస్మిక మృతి తమను వేదనకు గురిచేసిందన్నారు. అయితే అతడి మరణానికి గల కారణాలు ఆమె వెల్లడించలేదు.
కాగా ది ఫ్లాష్‌లో చిన్నారి బ్యారీ అలెన్‌గా మెప్పించిన విలియమ్స్ 16 ఏళ్ల వయస్సులోనే కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక విలియమ్స్ సహ నటులు కూడా అతడితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... నివాళులు అర్పిస్తున్నారు. ఈ వార్త తమను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. కాగా పదేళ్ల వయస్సులోనే నటనా జీవితం ప్రారంభించిన అనేక టీవీ షోల్లో నటించాడు.