
నికొలస్ కేజ్
ఏదైనా సినిమాలో తమ పాత్రకు అనుగుణంగా డ్యాన్సింగ్‌కో, కొత్త భాష నేర్చుకోవడానికో నటీనటులు ట్రైనర్స్‌ని పెట్టుకుంటారు. అయితే హాలీవుడ్ యాక్టర్ నికొలస్ కేజ్ మాత్రం తాగడం కోసం ఓ కోచ్‌ను పెట్టుకున్నారు. ‘లీవింగ్ లాస్‌వేగాస్’ అనే చిత్రంలో మద్యానికి బానిసైన రచయితగా నికొలస్ నటించాలి. ఆ పాత్ర కోసం డ్రింకింగ్ కోచ్‌ని పెట్టుకోవల్సి వచ్చింది. సినిమా షూటింగ్ చేసే రోజులన్నీ అతన్ని సెట్లోనే ఉండమని, అతని ఆహార్యాన్ని గమనిస్తూ ఈ సినిమాను పూర్తి చేశారట. ఈ విషయాన్ని ఇటీవల నికొలస్ తెలిపారు. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్‌గా కేజ్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నారు. అన్నట్లు.. నికొలస్‌కు మద్యం అలవాటు లేక కోచ్‌ని పెట్టుకున్నారను కుంటున్నారా? అదేం లేదు. అయితే బానిస అయిన వ్యక్తిగా నటించాలి కదా.. అందుకే.
Comments
Please login to add a commentAdd a comment