
Hugh Jackman Tests Positive For Corona: హాలీవుడ్ స్టార్ హీరో హ్యూ జాక్‌మన్ అంటే తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని పేరు. కానీ 'దెయ్యాల కోట' సినిమా హీరో అంటే తెలియని 90స్ కిడ్స్ మాత్రం ఉండరు. 2004లో హ్యూ జాక్‌మన్ నటించిన వాన్ హెల్సింగ్ చిత్రాన్ని తెలుగులో దెయ్యాల కోట పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. అప్పుడు ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అయితే తర్వాత 'దెయ్యాల కోట' పేరుతో అనేక హాలీవుడ్ చిత్రాలు డబ్ అయ్యాయి. హ్యూ జాక్‌మన్ కూడా ఎక్స్‌మెన్ సిరీస్‌తో మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన బ్రాడ్‌వేకు చెందిన 'ది మ్యూజిక్ మ్యాన్' షోకి ప్రదర్శన ఇచ్చే పనిలో ఉన్నాడు. అయితే మంగళవారం ఈ హీరోకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయనే ప్రకటించాడు.
'ఈ రోజు ఉదయం (డిసెంబర్ 29 మంగళవారం) నేను కొవిడ్ పరీక్ష చేసుకుంటే పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు జలుబు, గొంతు నొప్పి, కొంచెం ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నాయి. కానీ నేను బాగానే ఉన్నాను. వీలైనంతా త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తాను. రివర్ సిటీ వేదికపై కచ్చితంగా కలుసుకుంటాను.' అని హ్యూ జాక్‌మన్ తెలిపాడు. హ్యూ జాక్‌మన్‌కు కరోనాతో తాను ప్రదర్శిస్తున్న 'ది మ్యూజిక్ మ్యాన్' షో జనవరి 1 వరకు వాయిదా పడింది. జనవరి 2న వింటర్ గార్డెన్ థియేటర్ వేదికపైకి హ్యూ జాక్‌మన్ రావాలని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment