Hugh Jackman
-
స్పైడర్ మేన్‌ను దాటిన డెడ్ పూల్!
హాలీవుడ్ సూపర్ హీరోస్ ఫిల్మ్స్‌లో ‘డెడ్ పూల్’ ఫ్రాంచైజీ ఒకటి. 2016లో వచ్చిన ‘డెడ్ పూల్’, 2018లో వచ్చిన ‘డెడ్ పూల్ 2’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ప్రేక్షకులను అమితంగా అలరించాయి. తాజాగా ‘డెడ్ పూల్’ సిరీస్‌లోని మూడో భాగం ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్మెన్ ప్రధాన పాత్రల్లో, ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ కీలక పాత్రల్లో నటించారు. షాన్ లెవీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూలై 26న ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 365 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. 24 గంటల్లో ఇన్ని వ్యూస్ రావడంతో ఇదే ప్రపంచ రికార్డు అని మేకర్స్ పేర్కొన్నారని హాలీవుడ్ అంటోంది. గతంలో ఈ రికార్డు 2021లో విడుదలైన ‘స్పైడర్‌మేన్: నో వే హోమ్’ ట్రైలర్ పేరిట ఉండేది. 24 గంటల్లో ‘స్పైడర్ మేన్: నో వే హోమ్’ ట్రైలర్ 355.5 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ ట్రైలర్ రాకతో ‘స్పైడర్‌మేన్: నో వే హోమ్’ సెకండ్ ప్లేస్‌లోకి వెళ్లింది. - పోడూరి నాగ ఆంజనేయులు -
ఆ స్టార్ హీరో గే అంటూ ట్రోలింగ్.. అలాగే ఉంటాడన్న భార్య
Hugh Jackman Wife Deborra Reacts To Rumours About His Sexuality: హాలీవుడ్లో 'ఎక్స్ మెన్' చిత్రాలతో సూపర్ పాపులర్ అయిన స్టార్ హీరో హ్యూ జాక్మన్. ఇటీవల ఈ హీరో స్వలింగ సంపర్కుడని ట్రోలింగ్‌కు గురయ్యాడు. హ్యూ జాక్మన్ ఒక గే అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ విషయంపై అతని భార్య, నటి, డైరెక్టర్, చిల్డ్రన్ లాయర్ డెబోరా లీ ఫర్నెస్ క్లారిటీ ఇచ్చింది. 'ఇది చాలా వెర్రి (సిల్లీ), విసుగు తెప్పించే విషయం. ప్రజలు ఇలా ఎలా మాట్లాడతారు ? పత్రికలు కూడా ఇలాంటివి పబ్లిష్ చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. వారు అమ్ముతున్నది ఒక చెత్త. ప్రజలు ఎప్పుడూ ఇలాంటి వార్తలు చదువుతారనే అలా రాసుకొస్తారు. ఇలాంటి వార్తలతో మీ పత్రికలు ఎక్కువ అమ్ముడుపోయి, మీకు మంచి అనుభూతి కలుగుతుంది కదా. కానీ మీరు ఒకరి దుఃఖాన్ని విక్రయిస్తున్నారు.' అని హ్యు జాక్మన్ గురించి తప్పుగా ప్రచురించిన మ్యాగజైన్స్‌పై విరుచుకుపడింది. చదవండి: అమ్మాయిపై దాడి.. రెండోసారి అరెస్టయిన హీరో.. హ్యూ జాక్మన్, డెబోరా 1996లో వివాహం చేసుకున్నారు. వారికి ఆస్కార్ మాక్సిమిలియన్ జాక్మన్, అవా ఎలియట్ జాక్మన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హ్యుూ జాక్మన్ స్వలింగ సంపర్కుడనే పుకార్లపై హ్యూ జాక్మన్ చమత్కారంగా స్పందించాడని డెబోరా తెలిపింది. ఒకవేళ అతను గే అయితే హీరో బ్రాడ్‌పిట్‌తో డేటింగ్ చేసేవాడినని చెప్పాడని డెబోరా పేర్కొంది. 'అతను స్వలింగ సంపర్కుడైతే అలాగే ఉంటాడు. ఈ విషయాన్ని అతనికి దాచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా లేదు. అతను బ్రాడ్‌పిట్‌తో లేదా ఇంకేవరితో అయినా డేటింగ్ చేస్తాడు.' అని డెబోరా పేర్కొంది. వీరిద్దరూ 1995లో ఆస్ట్రేలియన్ టీవీ సిరీస్ కొరెల్లి సెట్లో కలుసుకున్నారు. నాలుగు నెలల డేటింగ్ తర్వాత డెబోరా ఫర్నెస్‌కు హ్యూ జాక్మన్ మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. చదవండి: ఇప్పటికే 9 మంది భార్యలు, మరో ఇద్దరు కావాలట.. ఆ కోరిక తీర్చుకోవాలట పుట్టినరోజుకు 2 రోజుల ముందు చనిపోయిన పాపులర్ నటి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_771247577.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్టార్ హీరోకు కరోనా పాజిటివ్.. వీలైనంత త్వరగా కోలుకుంటా
Hugh Jackman Tests Positive For Corona: హాలీవుడ్ స్టార్ హీరో హ్యూ జాక్మన్ అంటే తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని పేరు. కానీ 'దెయ్యాల కోట' సినిమా హీరో అంటే తెలియని 90స్ కిడ్స్ మాత్రం ఉండరు. 2004లో హ్యూ జాక్మన్ నటించిన వాన్ హెల్సింగ్ చిత్రాన్ని తెలుగులో దెయ్యాల కోట పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. అప్పుడు ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అయితే తర్వాత 'దెయ్యాల కోట' పేరుతో అనేక హాలీవుడ్ చిత్రాలు డబ్ అయ్యాయి. హ్యూ జాక్మన్ కూడా ఎక్స్‌మెన్ సిరీస్‌తో మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన బ్రాడ్వేకు చెందిన 'ది మ్యూజిక్ మ్యాన్' షోకి ప్రదర్శన ఇచ్చే పనిలో ఉన్నాడు. అయితే మంగళవారం ఈ హీరోకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయనే ప్రకటించాడు. 'ఈ రోజు ఉదయం (డిసెంబర్ 29 మంగళవారం) నేను కొవిడ్ పరీక్ష చేసుకుంటే పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు జలుబు, గొంతు నొప్పి, కొంచెం ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నాయి. కానీ నేను బాగానే ఉన్నాను. వీలైనంతా త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తాను. రివర్ సిటీ వేదికపై కచ్చితంగా కలుసుకుంటాను.' అని హ్యూ జాక్మన్ తెలిపాడు. హ్యూ జాక్‌మన్‌కు కరోనాతో తాను ప్రదర్శిస్తున్న 'ది మ్యూజిక్ మ్యాన్' షో జనవరి 1 వరకు వాయిదా పడింది. జనవరి 2న వింటర్ గార్డెన్ థియేటర్ వేదికపైకి హ్యూ జాక్మన్ రావాలని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. View this post on Instagram A post shared by Hugh Jackman (@thehughjackman) -
టీ షర్ట్ ఖరీదు నాలుగు లక్షలు!
మానవత్వానికి చిరునామా టేలర్ స్విఫ్ట్ అని హాలీవుడ్లో అంటుంటారు. గాయనిగా, రచయిత్రిగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్విఫ్ట్ సేవా కార్యక్రమాల ద్వారా మంచి మనిషి అనిపించుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే.. సహాయం చేయడానికి ముందుంటారామె. ఎంతోమంది పేద పిల్లలను చదివిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీ ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. ఇటీవల ఎయిడ్స్ బాధితుల సహాయార్థం జరిగిన ఓ వేలం పాట కార్యక్రమంలో పాల్గొన్నారు స్విఫ్ట్. నటుడు, నిర్మాత హగ్ జాక్మాన్ వాడిన టీ షర్ట్, బెల్ట్‌తో పాటు మరికొన్ని వస్తువులను వేలానికి పెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, జాక్మాన్ టీ షర్ట్‌ని నాలుగు లక్షలకు కొన్నారు స్విఫ్ట్. ఆ నాలుగు లక్షలకు అదనంగా ఇంకొంత డబ్బు చేర్చి, ఎయిడ్స్ బాధితుల సహాయార్థం ఇచ్చేశారు. ఇలా సేవా కార్యక్రమల కోసమే బోల్డంత డబ్బు ఖర్చుపెడుతుంటారట. అందుకే రెండేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడి సతీమణి మిచెలీ ఒబామా ‘డెడికేషన్ టు హెల్పింగ్ అదర్స్’ అనే అవార్డుని టేలర్ స్విఫ్ట్‌కి ఇచ్చారు. -
40 ప్లస్ లోనూ... కండలు పెంచుతున్నారు...
ధోరణి వయసు పై బడుతున్న కొద్దీ చాలామంది పురుషులు వ్యాయామాలు తగ్గిస్తారు. జిమ్‌కు అరుదుగా మాత్రమే వెళుతుంటారు. కొందరిలో అయితే జిమ్‌కు వెళ్లడం-శరీరాకృతి మీద దృష్టి పెట్టడం అనేది యవ్వనకాలానికి మాత్రమే పరిమితమైన వ్యవహారంగా మారింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. మన దేశంతో సహా చాలా దేశాల్లో నలభై దాటిన పురుషులు శరీరాకృతిపై దృష్టి పెట్టి కండలు పెంచుతున్నారు. కొంతమంది అయితే బాడీ బిల్డర్లుగా కూడా తయారై ఆశ్చర్యపరుస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి 40 ప్లస్ పురుషులలో కండలు పెంచే ధోరణి బాగా పెరిగింది. తానేమిటో, తన ఆఫీసేమిటో... అన్నట్లుగా ఉండేది బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే భార్గవ్ జీవనశైలి. నలభై రెండు సంవత్సరాల భార్గవ్ ఉన్నట్టుండి జిమ్ ప్రేమలో పడడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఉండబట్టలేక ఎవరో కారణం కూడా అడిగారు. ‘‘హాలివుడ్ నటుడు హగ్ జాక్మన్ నటించిన ఒక సినిమా చూశాక...అతని నటన కంటే శరీరాకృతి ఎంతో ఆకట్టుకుంది. ఆయన వయసు నలభై అయిదు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. నలభై రెండు సంవత్సరాల నేను మాత్రం బొజ్జ పెరిగి, లావుగా ఉంటాను. నన్ను చూస్తే హగ్ కంటే కనీసం రెండు సంవత్సరాలు పెద్ద అనుకునేలా ఉంటాను. శరీరాకృతి అనేది వయసును ప్రభావితం చేస్తుందనే విషయాన్ని కాస్త ఆలస్యంగానైనా తెలుసుకోగలిగాను. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాను. దీనివల్ల నేను హగ్లా కండలు తిరిగి కనిపించకపోవచ్చు. కానీ ఎంతో కొంత మార్పుతో చూడముచ్చటగా కనిపిస్తున్నాను’’ అని చెప్పాడు భార్గవ్. ఇక లండన్ నివాసి డేవిడ్సన్ ఇలా అంటున్నాడు. ‘‘టీనేజ్‌లో వ్యాయామం చేసే వాడిని కానీ...పెద్ద సీరియస్‌గా చేసేవాడిని కాదు. ఒకానొక దశలో ఉత్సాహం తగ్గి పోయి జిమ్‌కు దూరమయ్యాను. చాలా విరామం తరువాత మళ్లీ వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తున్నాను. కండలు తిరిగిన శరీరంతో నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను’’ ‘‘నలభై దాటిన వాళ్లు వ్యాయామం పట్ల ఆకర్షితులు కావడం అనేది మంచి పరిణామం. వ్యాయామం వల్ల కండలు పెరగడం ఒక్కటే కాదు...చాలా ప్రయోజనాలు ఉన్నాయి’’ అంటూ ‘టాప్ బెనిఫిట్స్’ జాబితాను చదవడం మొదలుపెట్టాడు న్యూయార్క్‌లోని ‘రిజల్ట్స్ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్’ డెరైక్టర్ రిచ్ స్టర్ల్. హగ్ జాక్మన్ నటించిన ఒక సినిమా చూశాక... అతని నటన కంటే శరీరాకృతి ఎంతో ఆకట్టుకుంది. ఆయన వయసు నలభై అయిదు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. - భార్గవ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి -
మైక్రోమ్యాక్స్ ప్రచారకర్తగా ‘ఎక్స్-మెన్’ జాక్మన్
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్‌కు ఎక్స్-మెన్ సినిమాల హీరో, ప్రముఖ హాలీవుడ్ స్టార్ హ్యూ జాక్మన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యహరించనున్నారు. విదేశీ మార్కెట్లపై కన్నేసిన మైక్రోమ్యాక్స్ ఈ హాలీవుడ్ స్టార్‌తో బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి ఒక హాలీవుడ్ స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత మొబైల్ కంపెనీగా మైక్రోమ్యాక్స్ నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించడానికి అక్కడి ప్రజలతో అనుసంధానానికి హ్యూ జాక్‌మన్‌తో భాగస్వామ్యం దోహదపడుతుందని భావి స్తున్నట్లు మైక్రోమ్యాక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, శుభోదిప్ పాల్ చెప్పారు. భారత్ అద్భుత దేశమని, ఈ దేశాన్ని తాను అమితం గా ప్రేమిస్తానని జాక్మన్ వ్యాఖ్యానించారు. సీఈవో రాజీనామా: మైక్రోమ్యాక్స్ సీఈవో పదవికి దీపక్ మెహరోత్రా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల దీపక్ రాజీనామా చేశారని మైక్రోమ్యాక్స్ తెలిపింది. కొత్త సీఈవోను త్వరలోనే ప్రకటిస్తామని వివరించింది.