ఆ స్టార్‌ హీరో గే అంటూ ట్రోలింగ్‌.. అలాగే ఉంటాడన్న భార్య | Hugh Jackman Wife Deborra Reacts To Rumours About His Sexuality | Sakshi
Sakshi News home page

Hugh Jackman: అతను గే అయితే దాచాల్సిన అవసరం లేదు: స్టార్‌ హీరో భార్య

Published Fri, Apr 22 2022 7:01 PM | Last Updated on Fri, Apr 22 2022 7:06 PM

Hugh Jackman Wife Deborra Reacts To Rumours About His Sexuality - Sakshi

Hugh Jackman Wife Deborra Reacts To Rumours About His Sexuality: హాలీవుడ్‌లో 'ఎక్స్‌ మెన్‌' చిత్రాలతో సూపర్‌ పాపులర్‌ అయిన స్టార్‌ హీరో హ్యూ జాక్‌మన్‌. ఇటీవల ఈ హీరో స్వలింగ సంపర్కుడని ట్రోలింగ్‌కు గురయ్యాడు. హ్యూ జాక్‌మన్‌ ఒక గే అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ విషయంపై అతని భార్య, నటి, డైరెక్టర్‌, చిల్డ్రన్‌ లాయర్ డెబోరా లీ ఫర్నెస్ క్లారిటీ ఇచ్చింది. 'ఇది చాలా వెర్రి (సిల్లీ), విసుగు తెప్పించే విషయం. ప్రజలు ఇలా ఎలా మాట్లాడతారు ? పత్రికలు కూడా ఇలాంటివి పబ్లిష్‌ చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. వారు అమ్ముతున్నది ఒక చెత్త. ప్రజలు ఎప్పుడూ ఇలాంటి వార్తలు చదువుతారనే అలా రాసుకొస్తారు. ఇలాంటి వార్తలతో మీ పత్రికలు ఎక్కువ అమ్ముడుపోయి, మీకు మంచి అనుభూతి కలుగుతుంది కదా. కానీ మీరు ఒకరి దుఃఖాన్ని విక్రయిస్తున్నారు.' అని హ్యు జాక్‌మన్‌ గురించి తప్పుగా ప్రచురించిన మ్యాగజైన్స్‌పై విరుచుకుపడింది. 



చదవండి: అమ్మాయిపై దాడి.. రెండోసారి అరెస్టయిన హీరో..

హ్యూ జాక్‌మన్‌, డెబోరా 1996లో వివాహం చేసుకున్నారు. వారికి ఆస్కార్ మాక్సిమిలియన్‌ జాక్‌మన్‌, అవా ఎలియట్ జాక్‌మన్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హ్యుూ జాక్‌మన్‌ స్వలింగ సంపర్కుడనే  పుకార్లపై హ్యూ జాక్‌మన్‌ చమత్కారంగా స్పందించాడని డెబోరా తెలిపింది. ఒకవేళ అతను గే అయితే హీరో బ్రాడ్‌పిట్‌తో డేటింగ్‌ చేసేవాడినని చెప్పాడని డెబోరా పేర్కొంది. 'అతను స్వలింగ సంపర్కుడైతే అలాగే ఉంటాడు. ఈ విషయాన్ని అతనికి దాచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా లేదు. అతను బ్రాడ్‌పిట్‌తో లేదా ఇంకేవరితో అయినా డేటింగ్‌ చేస్తాడు.' అని డెబోరా పేర్కొంది. వీరిద్దరూ 1995లో ఆస్ట్రేలియన్‌ టీవీ సిరీస్‌ కొరెల్లి సెట్‌లో కలుసుకున్నారు. నాలుగు నెలల డేటింగ్‌ తర్వాత డెబోరా ఫర్నెస్‌కు హ్యూ జాక్‌మన్‌ మ్యారేజ్‌ ప్రపోజ్‌ చేశాడు.



చదవండి: ఇప్పటికే 9 మంది భార్యలు, మరో ఇద్దరు కావాలట.. ఆ కోరిక తీర్చుకోవాలట

పుట్టినరోజుకు 2 రోజుల ముందు చనిపోయిన పాపులర్‌ నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement