కైరో: ప్రఖ్యాత ఈజిప్షియన్, హాలీవుడ్ నటుడు ఒమర్ షరీఫ్(83) శుక్రవారం కైరోలో గుండెపోటుతో మరణించారు. అల్జీమర్స్ వ్యాధి వల్ల కొంతకాలంగా ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ఆయనకు మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమారుడు (తారిఖ్ ఎల్ షరీఫ్) ఉన్నారు. లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ ఝివాగో వంటి సినిమాల్లో నటన ద్వారా ఒమర్ షరీఫ్ అంతర్జాతీయంగా ప్రసిద్ధినొందారు.
లారెన్స్ ఆఫ్ అరేబియాలో నటనకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇదే సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డునూ గెలుచుకున్నారు. చే సినిమాలో చే గువేరా పాత్రనూ పోషించారు. 1953 నాటి ద బ్లేజింగ్ సన్ సినిమాలో తనతో పాటు నటించిన ఫాతెన్ హమామాను షరీఫ్ వివాహమాడారు. తనతో కలిసి అనేక సినిమాల్లో నటించిన హమామాను పెళ్లి చేసుకునేందుకు క్రై స్తవుడైన ఆయన ఇస్లాం స్వీకరించారు. చివరిసారిగా 2013లో రాక్ ద కాస్బా సినిమాలో నటించారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత
Published Sat, Jul 11 2015 8:45 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement