passedy away
-
Krishna: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!
సూపర్‌స్టార్ కృష్ణ(79) ఇకలేరు. తెలుగు సినీపరిశ్రమలో ఎన్నో అధునాతన విషయాలు తెరమీదకు తెచ్చిన నటుడు..కోట్లాది మంది ప్రేక్షకులను విషాదంలో ముంచుతూ శాశ్వత సెలవు తీసుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. చిత్రపరిశ్రమలో ఆయన చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చేయలేదు. మొట్టమొదటి స్కోప్ తెలుగు చిత్రం అల్లూరి సీతారామరాజు కావడం తెలిసిందే. అలాగే మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు.మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం సింహాసనం. 40– 50 లక్షల్లో సిన్మాలు తీసే ఆ రోజుల్లో ఈ జానపదం కోసం దర్శక, నిర్మాత, హీరో కృష్ణ రూ. 3 కోట్ల 20 లక్షల దాకా చాలా ధైర్యంగా ఖర్చు పెట్టారు. బిజినెస్ కూడా అదే రేంజ్లో భారీగా జరిగింది. ఈ చిత్రానికి స్వయంగా ఆయనే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఎన్నో మైలురాళ్లు దాటిన ఆయన దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించి అందరిని అబ్బురపరచారు. 350 పైగా చిత్రాల్లో హీరోగా నటించాడు. ఒకే ఏడాది ఎక్కువ సినిమాలు విడుదల చేసిన హీరోగా కూడా కృష్ణ అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. 70-71వ దశకంలో కృష్ణ నటన తెలుగు ప్రేక్షకులకు మరుపురానిది. ఒక ఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్లను పరిచయం చేశాయి. ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరో కూడా కృష్ణే. కెరీర్ మొత్తంలో 50 మల్టీస్టారర్స్ చేశారు. చిత్ర పరిశ్రమలో కృష్ణ నెలకొల్పిన రికార్డులను మరే హీరో సాధించలేడనడం అతిశయోక్తి కాదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిత్రపరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
Bengali Director Tarun Majumdar Passed Away At 92: సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ బెంగాలీ దర్శకుడు తరుణ్ మజుందార్ కన్నుమూశారు. మధ్యతరగతి కుటుంబాల జీవితం, వారు ఎదుర్కొనే ఒడిదొడుకుల ఆధారంగా హృద్యమైన కథల చుట్టూ తిరిగే ఐకానిక్ చిత్రాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఇలా భారతీయ చలన చిత్ర రంగంలో ప్రముఖ దర్శకుడిగా మారారు తరుణ్ మజుందార్. 92 ఏళ్ల తరుణ్ గత కొంతకాలంగా వయో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇందు కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం (జులై 4) తుది శ్వాస విడిచారు. బ్రిటీష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీలో 1931, జనవరి 8న తరుణ్ మజుందార్ జన్మించారు. 1959లోని 'చోవా పావా' సినిమాతో డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు 'యాత్రిక్' పేరుతో సచిన్ ముఖర్జీ, దిలీప్ ముఖర్జీలతోపాటు తరుణ్ మజుందార్ దర్శకత్వం వహించారు. 1960, 70, 80 దశకాల్లో మజుందార్ తెరకెక్కించిన శ్రీమాన్ పృథ్వీరాజ్, కుహెలి, బాలికా వధు, దాదర్ కీర్తి లాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 1990లో పద్మశ్రీ పురస్కారం వరించగా పలు జాతీయ అవార్డులను సైతం దక్కించుకున్నారు తరుణ్ మజుందార్. చదవండి: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం -
సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన మొదటి మహిళ మల్లు స్వరాజ్యమే. మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలు.. ► తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం. ► 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం గారి ఇంటిని నైజాం గుండాలు తగలబడ్డాయి. మల్లు స్వరాజ్యం గారు సాయుధ పోరాటంలో అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. మహిళ కమాండర్‌గా పని చేశారు. ► అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యాన్ని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. ► వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీపీఎం పార్టీ తరఫున పనిచేశారు. ► మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. ► అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యంకు కూతురు పాదూరి కరుణ, కుమారులు మల్లు గౌతమ్ రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి ఉన్నారు. ఆమె చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికలు నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సీపీఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా, చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు. -
కోకిల వెళ్లిపోయింది!
వసంతంలో కోకిల గొంతు సవరించుకుంటుంది. పంచమ శ్రుతిలో తన స్వరమాధుర్యాన్ని జనాలకు అయాచితంగానే పంచిపెడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ, వసంత పంచమితో పాటూ ఆ గాన కోకిల వెళ్ళిపోయింది. ఎంత చేటుకాలం ఇది! ఎంత పాడుకాలం ఇది! మాయదారి మహమ్మారి ఇప్పటికే ఎందరెందరినో గద్దలా తన్నుకుపోయింది. మనసులకు మారాకులు వెయ్యనివ్వని ఆశ రాలుకాలం ఇది. కోకిలను పోగొట్టుకున్న అశేష సంగీతాభిమానులకు అకాల బాష్పవర్షాకాలం ఇది. ‘కరోనా‘ కరాళకాలం మొన్నటికి మొన్న మన గానగంధర్వుడిని గల్లంతు చేసింది. అభిమానులు ఆ విషాదం నుంచి తేరుకుంటూ ఉన్నారనేలోగానే, మిగిలి ఉన్న గాన కోకిలనూ ఇప్పుడు తీసుకుపోయింది. వసంత పంచమి మరునాటి ఉదయమే అస్తమించిన గానకోకిల లతామంగేష్కర్ భారతీయ సినీసంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణి. స్వతంత్ర భారతదేశంలో పుట్టిన వారిలో ఆమె స్వరఝరిలో తడిసి తరించనివారంటూ ఎవరూ ఉండరు. ఇది అతిశయోక్తి కాదు. స్వభావోక్తి మాత్రమే! ఆమె స్వరప్రస్థానం భారతదేశ స్వాతంత్య్ర ప్రస్థానంతో పాటే సాగింది. ఇన్నేళ్లలోనూ స్వాతంత్య్ర భారతం ఎన్నో ఎగుడుదిగుళ్లను చవిచూసింది గాని, లతా గాత్రం మాత్రం ఏనాడూ చెక్కుచెదరలేదు. వన్నెతరగని ఆమె స్వరమాధుర్యం దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా కొన్నితరాల శ్రోతలను సేదదీర్చింది, ఊరడించింది, ఉర్రూతలూపి ఓలలాడించింది. లతా పాట ఎల్లలులేని పిల్లతెమ్మెర. ఆమె అభిమానుల్లో దేశాధినేతలు మొదలుకొని అమిత సామాన్యుల వరకు కోట్లమంది ఉన్నారు. లతా పాట గలగలల సెలయేరు. ఆమె అభిమానుల్లో ఉద్దండ పండితులూ ఉన్నారు, పరమ పామరులూ ఉన్నారు. లతా పాట జోలలూపే ఉయ్యాల. ఆమె అభిమానుల్లో పసిపిల్లలూ ఉన్నారు, పండు ముదు సళ్లూ ఉన్నారు. లతా పాట ఒక అమృత« దార. అక్షరాలా ఆబాలగోపాలాన్నీ అలరించిన అద్భుత గానమాధుర్యం ఆమెది. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్ ఒక హిమవత్ శిఖరం. సినీ సంగీత రంగంలో రాణించాలనుకునే ఔత్సాహిక గాయనీగాయకులకు ఆమె ఒక అత్యున్నత ప్రమాణం. ఆమెతో గొంతు కలిపితే చాలు, తమ జన్మ చరితార్థమైనట్లే అనుకునే యువ గాయకులు ఎందరో! ఆమె స్థాయిలో పదోవంతును అందుకోగలిగినా చాలు, తమ కెరీర్‌కు తిరుగుండదని భావించే కొత్తతరం గాయనీమణులు ఎందరో! ఆమె పాటలకు స్వరకల్పన చేసే అవకాశం దొరకడమంటే నవ తరం సంగీత దర్శకులకు అదొక హోదాచిహ్నం! ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరానికి చేరు కోవడం అంత ఆషామాషీ పని కాదు. ఒకసారి చేరుకున్నాక, కడవరకు ఆ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడం మరెంతటి కఠోరదీక్షతో సాధించిన ఘనత అయి ఉండాలి! ఆ ఘనత కారణంగానే దేశంలోని అత్యున్నత సత్కారమైన ‘భారతరత్న’ సహా అసంఖ్యాకమైన అవార్డులు, బిరుదులు, రాజ్యసభ సభ్యత్వం వంటి గౌరవ పదవులు ఆమెను కోరి మరీ వరించాయి. రాజ్యసభలో కొన సాగిన ఆరేళ్లూ రూపాయి వేతనమైనా తీసుకోకుండా సేవలందించిన అరుదైన వ్యక్తిత్వం ఆమెది. పదమూడేళ్ల పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయి, కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్న ఒక సాదాసీదా అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి, ఎవరూ అందుకోలేనంత స్థానానికి చేరుకోవడం దాదాపు ఊహాతీతం. సినిమాను తలపించే లతా జీవితంలో ఇది వాస్తవం. తొలినాళ్లలో ఆర్థిక కష్టాలతో సతమతమవుతూనే, సంగీత సాధన కొనసాగించేది. సినీ అవకాశాల కోసం ప్రయత్నించే తొలినాళ్లలో ‘పీల గొంతు’ అనే పెదవి విరుపులతో తిరస్కారాలనూ ఎదుర్కొంది. తిరస్కారాలకు చిన్నబుచ్చుకుని అక్కడితోనే ఆగిపోయి ఉంటే, ఆమె లతా అయ్యేదే కాదు. పట్టువదలని దీక్షతో ముందుకు సాగడం వల్లనే ఆమె రుతువులకు అతీతమైన ‘గానకోకిల’ కాగలిగింది. మాతృభాష మరాఠీ, హిందీ పాటలకే పరిమితమై ఉంటే, లతా మంగేష్కర్‌కు ఇంతటి ప్రఖ్యాతి దక్కేది కాదు. ఆమె మన తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో పాటలు పాడింది. అందుకే, దేశవ్యాప్తంగా మారుమూల పల్లెల్లోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో సినిమా పాటలు పాడిన గాయనిగా 1974లోనే గిన్నిస్ రికార్డు సాధించిన ఘనత ఆమెకే దక్కింది. అప్పటికే ఆమె వివిధ భాషల్లో పాతికవేల పైగా పాటలు పాడింది. శతాధిక సంగీత దర్శకుల స్వరకల్పనలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. నాలుగు తరాల గాయకులతో గొంతు కలిపింది. ఐదు చిత్రాలకు సంగీతం అందించడమే కాక, 4 చిత్రాలను నిర్మించింది. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆమె అందుకోని విజయాల్లేవు. ఆమె గొంతు పలకని భావోద్వేగాలు లేవు. ఆమె గాత్రంలో ఒదగని సంగతులు లేవు. భారతదేశంలో లతా భాషాతీతంగా ప్రతి ఇంటి అభిమాన గాయని. అందుకే, ఆమె మరణవార్త యావత్ దేశాన్ని్న విషాదసాగరంలో ముంచేసింది. ఆమె మరణవార్త వెలువడిన మరునిమిషం నుంచే సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాల ప్రవాహం మొదలైంది. ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ అభిమానులు ఆమె పాటల వీడియోలతో పెట్టిన పోస్టులతో సామాజిక మాధ్య మాలు హోరెత్తిపోవడం మొదలైంది. లతానే ప్రేరణగా తీసుకుని, ఆమె స్ఫూర్తితోనే సినీసంగీత రంగంలోకి అడుగుపెట్టిన సంగీత కళాకారులంతా ఆమె మరణవార్తకు కన్నీరు మున్నీరయిన దృశ్యా లను టీవీల్లో చూసిన అభిమానులూ కన్నీటి పర్యంతమయ్యారు. భారతీయ సినీ సంగీతరంగంలో ఎందరో గాయనీమణులు ఉన్నా, లతా మంగేష్కర్ది ఒక అత్యున్నత ప్రత్యేకస్థానం. ఇప్పుడది ఖాళీ అయిపోయింది. దానినెవరూ ఎప్పటికీ భర్తీ చేయలేరు! -
గాయకుడు మాణిక్య వినాయకం కన్నుమూత.. సీఎం స్టాలిన్ నివాళి
Tamil Singer Manicka Vinayagam Passes Away: ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయకం ఆదివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఈయన వయసు 78 ఏళ్లు. సంగీత కుటుంబంలో జన్మించిన ఈయన సొంత ఊరు మైలాడుదురై సమీపంలోని వళువూర్ గ్రామం. భరత నాట్య కళాకారుడు వళువూర్ రామయ్య పిళ్లై ఈయన తండ్రి. తన మామ సితార వాయిద్య కళాకారుడు సీఎస్.జయరామన్ వద్ద మాణిక్య వినాయకం సంగీతాన్ని నేర్చుకున్నారు. ఈయన 2001లో దిల్ చిత్రం ద్వారా గాయకుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సంగీత ప్రియులను అలరించారు. 2002లో తిరుడా తిరిడి చిత్రం ద్వారా నటుడిగానూ పరిచయమయ్యారు. ఈయన 200కు పైగా చిత్రాల్లోనూ, అనేక భక్తి గీతాలు పాడి పేరు తెచ్చుకున్నారు. స్థానిక అడయార్‌లోని శాస్త్రీనగర్‌లో నివసిస్తున్న అనారోగ్యం కారణంగా ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నివాళి మాణిక్య వినాయకం మృతికి గాయని చిత్ర, దర్శకుడు శీనూరామసామి తదితరులు ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సోమవారం మాణిక్య వినాయకం ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. సీఎం వెంట పాటు మంత్రి సుబ్రమణియన్ తదితరులు ఉన్నారు. మాణిక్య వినాయకం భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం అడయార్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: (ఈ ఏడాది చివరి వారంలో వచ్చే సినిమాలు ఇవే..) -
ముగ్గురు మృతిచెందిన ఘటనలో ట్విస్ట్, ఇంటికి భోజనానికి పిలిచి..
తిరుమలాయపాలెం: భూతగాదా నేపథ్యంలో వింధుభోజనానికి ఆహ్వానించి మద్యంలో విషం కలిపి ముగ్గురిని దారుణంగా హత్య చేశారంటూ మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాకు చెందిన బలరాం, రాములు, టాక్రియా, లక్ష్మా అన్నదమ్ములు. చాలా ఏళ్ల నుంచి బలరాం, టాక్రియా కుటుంబాల మధ్య భూవివాదం ఉంది. బలరాం కుమారుడు భిక్షంకు అర్జున్, చిన్నా అనే ఇద్దరు కొడుకులున్నారు. 11 రోజుల క్రితం అర్జున్ అనారోగ్యంతో మృతిచెందాడు. వివాదాలతో చిన్నా వారిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం అర్జున్ దశదిన కర్మ సందర్భంగా పెద్దనాన్న టాక్రియా కుమారులైన బోడా హరిదాసు, శంకర్, లక్ష్మా కుమారుడు బోడా మల్సూర్, భద్రులను కూడా పిలిచాడు. వారు రాత్రి భిక్షం ఇంటికి వెళ్లారు. హరిదాసు, భద్రు, మల్సూర్, శంకర్‌కు చిన్నా గ్లాసుల్లో మద్యాన్ని పోసి ఇచ్చాడు. అది తాగిన హరిదాసు, భద్రు నిమిషాల వ్యవధిలోనే సృహ కోల్పోయి కిందపడిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా హరిదాసు, భద్రు, మల్సూర్ ప్రాణాలొదిలారు. శంకర్ మద్యం తాగకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో చిన్నా, అతని తండ్రి భిక్షం పరారయ్యారు. మల్సూర్ కుమారుడు వెంకన్న ఫిర్యాదు మేరకు కూసుమంచి పోలీసులు బోడ చిన్నా, అతని తండ్రిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. పథకం ప్రకారమే హత్య నా భర్త హరిదాసు గొర్రెలు కాస్తుండేవాడు. ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదు. నేను మా కూతురి ఇంటికి వెళ్లి వచ్చే సరికే నా భర్తకు చిన్నా విషం ఇచ్చి చంపాడు. భోజనానికి వెళ్లకపోయినా ఇంటిచుట్టూ తిరిగి మరీ తీసుకెళ్లి మట్టుబెట్టాడు. – సుశీల, హరిదాసు భార్య ఇద్దరు పిల్లలతో నేనెలా బతకాలి కాయకష్టం చేసుకుని బతుకుతున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు. అమాయకుడైన నా భర్తను పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు నేను, నా పిల్లలు ఎలా బతకాలి. చిన్నా, భిక్షంను కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలి. – విజయ, భద్రు భార్య -
పెద్దపులిని చూపిస్తానని తీసుకెళ్లి..
రాయికల్:(జగిత్యాల): ‘మీకు పెద్దపులిని చూపిస్త.. నాతో రండి’అని ఓ తల్లి తన ఇద్దరు కుమారులను గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడ పిల్లలతో కలసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, పెద్దకుమారుడు మృతిచెందగా, చిన్నకుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేటలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిష్టంపేటకు చెందిన కస్తూరి సంపత్, లావణ్య(25) భార్యాభర్తలు. వీరికి గణేశ్(8), హర్షవర్ధన్ (6) అనే కుమారులు ఉన్నారు. పదేళ్ల క్రితం స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఉపాధి కోసం కిష్టంపేట గ్రామానికి వచ్చారు. ఇక్కడే కూలీ పనిచేసుకుంటూ బతుకుతున్నారు. శుక్రవారం భార్యాభర్తలు అల్లీపూర్ గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద కూలీ పనిచేసి ఇంటికి తిరిగి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత లావణ్య.. పెద్దపులిని చూపిస్తానంటూ తన ఇద్దరు కుమారులతో కలసి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావివద్దకు వెళ్లింది. తర్వాత ఇద్దరు కుమారులను పట్టుకుని బావిలో దూకింది. అయితే, ఈ ప్రయత్నంలో తల్లి, పెద్దకుమారుడు బావిలో పడిపోగా హర్షవర్ధన్ బావిగట్టువద్దే ఉండిపోయాడు. వెంటనే బాలుడు అక్కడ ఉన్నవారికి ఈ విషయం చెప్పగా, వారు బావి వద్దకు చేరుకుని లావణ్య, గణేశ్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు నీటిలో మునిగి చనిపోయారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే లావణ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అమ్మతో కలసి కేక్ కట్ చేసిన నిన్న నా పుట్టినరోజు. అమ్మా, నాన్న, అన్నయ్యతో కలసి కేక్ కట్ చేసిన. అందరికీ మిఠాయిలు పంచిన. రాత్రి అందరం బాగానే ఉన్నం. పొద్దునే అమ్మ, నాన్న కలసి పనికి పోయిండ్రు. నాకు పెద్దపులిని చూపిస్తనని అమ్మ నన్ను బాయికాడికి తీసుకెళ్లింది. నన్ను, అన్నను తీసుకుని బావిలో దూకింది. నేను బావిగట్టు వద్దే పడిపోయా. – హర్షవర్ధన్, చిన్నకుమారుడు -
కారా మాస్టారు కన్నుమూత: సీఎం జగన్ సంతాపం
సాక్షి, శ్రీకాకుళం: కారా మాస్టారుగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కథానిలయం వ్యవస్థాపకులు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత శ్రీకాకుళంలోని స్వగృహంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సాహితీలోకం తీవ్ర దిగ్ర్భాంతిలో మునిగిపోయింది. కథా సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ రచయితలు, కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదంటూ పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కథకు చిరునామాగా, 'కథానిలయం' పేరుతో భావి తరాల కోసం సాహితీ సంపదను కాపాడిన సాహితీ మూర్తి కారా మాస్టారు అంటూ కొనియాడారు. 1924లో శ్రీకాకుళం జిల్లా మురపాకలో జన్మించారు కాళీపట్నం రామారావు. తన దైన శైలిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఆయన వేలాది మంది శిష్యులు, అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 1964లో రాసిన యజ్ఞం కథ ఆయన విశేష ఖ్యాతిని తీసుకొచ్చింది. కథా రచయితగా తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఆయనది. ఫ్యూడల్ వ్యవస్థలోని దోపిడికి ‘యజ్ఞం’ అద్దంపడుతుంది. అందుకే ఈ రచన రష్యాలో అనువదింపబడి ప్రపంచ గుర్తింపు పొందింది. భావితరాలను దృష్టిపెట్టుకుని ఫిబ్రవరి 22, 1997లో శ్రీకాకుళంలో కథానిలయం స్థాపించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ద్వారా సమకూరిన డబ్బు, మరికొందరు సాహితీవేత్తల సహకారంతో 800 కథల పుస్తకాలతో ఆరంభమైన ఈ కథా నిలయం లక్ష పుస్తకాలతో అలరారుతుండటం విశేషం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన సరళమైన రచన శైలితో వేలాది అభిమానులను ఆకట్టుకున్నారు. కుట్ర, రాగమయి, జీవధార, కారా కథలు, రుతుపవనాలు వంటి ఆయన రచనలూ ఆదరణ పొందాయి. సీఎం జగన్ సంతాపం సాహిత్య అకాడమీ గ్రహీత, కారా మాస్టారుగా పేరొందిన కాళీపట్నం రామారావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. చిన్న కథలతో, తనదైన కథా శైలితో ఆకట్టుకున్న ఉత్తరాంధ్రలోని సాహిత్యకారుల్లో ఆయన ప్రముఖుడని సీఎం గుర్తు చేశారు. కారా మాస్టారు కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ తన సంతాపాన్ని తెలియజేశారు. -
బాలు వాక్కు బ్రహ్మ వాక్కు!
సాక్షి, హైదరాబాద్: 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు బాలసుబ్రహ్మణ్యం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిగిన సాంబమూర్తికి రెండో సంతానం బాలు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలు యుక్త వయసులోనే సంగీతంపట్ల ఆకర్షితుడయ్యారు. తల్లి కోరిక మేరకు ఇంజనీరింగ్ చేస్తూనే పలు సంగీత పోటీల్లో పాల్గొన్నారు. 1964లో తన తొలి అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఇళయరాజాతో కలసి ఓ మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేశారు. నటుడిగానూ సక్సెస్ ►ఏ హీరోకి పాడితే అది ఆ హీరో గొంతే అన్నట్లుగానే బాలు పాటలు పాడారు. విజయవంతమైన గాయకుడు అనిపించుకున్న ఆయన నటుడిగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1969లో ‘పెళ్లంటే నూరేళ్ల పంట’సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. ►1990లో ‘కేలడి కన్మణి’సినిమా (తెలుగులో ‘ఓ పాపా లాలి’)లో లీడ్ రోల్ చేశారు. ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరోప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘసుమంగళీభవ (1998) వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. ► ‘దేవస్థానం’, ‘మిథునం’చిత్రాల్లో లీడ్ రోల్స్‌లో కనిపించారు. బాలచందర్ తమిళ చిత్రం ‘మన్మధ లీలై’తెలుగు డబ్బింగ్ ‘మన్మధ లీల’తో డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు. ►కమల్‌హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ వంటి నటులకు గాత్రదానం చేశారు. 1977లో వచ్చిన ‘కన్యా కుమారి’తో సంగీత దర్శకుడిగా మారారు. ►తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 46 సినిమాలకు సంగీతం సమకూర్చారు. నిర్మాతగా ‘యోధ’, ‘భామనే సత్యభామనే’, ‘తెనాలి’, ‘శుభ సంకల్పం’వంటి సినిమాలు నిర్మించారు. ‘హలో బ్రదర్’ను ఆయన బ్యానర్ ద్వారా తమిళంలోకి అనువదించి నాగార్జున పాత్రలకు డబ్బింగ్ కూడా చెప్పారు బాలు. అవార్డులు ►ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 1979లో సంగీత ప్రధానంగా వచ్చిన ‘శంకరాభరణం’చిత్రానికిగాను ఆయన తొలి జాతీయ అవార్డు అందుకున్నారు. ►ఆ తర్వాత 1981లో హిందీ చిత్రం ‘ఏక్ ధూజే కేలియే’, 1983లో ‘సాగర సంగమం’, 1988లో ‘రుద్రవీణ’, 1995లో కన్నడ చిత్రం ‘సంగీత సాగర గానగోయి పంచాక్షర గవై’, 1996లో తమిళ చిత్రం ‘మిన్సార కనవు’చిత్రాలకు జాతీయ అవార్డు అందుకున్నారు. 25 నంది అవార్డులు దక్కాయి. ►భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలకుగాను 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. 2012లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. 2016లో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’అవార్డు తీసుకున్నారు. 1999లో పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఇంకా తమిళ, కన్నడ తదితర రంగాల నుంచి పలు అవార్డులు అందుకున్నారు. తొలి చిత్రం: మర్యాద రామన్న.. కోదండపాణి, పద్మనాభంతో బాలు బాలు కుటుంబం బాలుకు తన దగ్గరి బంధువైన సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. పల్లవి, ఎస్.పి. చరణ్. పాటకు ముఖ్యం పల్లవి, చరణం. ఈ రెండూ కలిసొచ్చేట్లుగా తన సంతానానికి పేర్లు పెట్టారు. బాలు తనయుడు ఎస్.పి.చరణ్ గాయకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. బాలు సోదరి ఎస్.పి. శైలజ కూడా గాయని. ఆమె భర్త నటుడు శుభలేఖ సుధాకర్. ఎస్.పి. బాలు తల్లి శకుంతలమ్మ గత ఏడాది ఫిబ్రవరి 4న మరణించారు. కాగా, తండ్రి స్థాపించిన భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజ స్మరణోత్సవ సభకు బాలసుబ్రహ్మణ్యం శాశ్వత అధ్యక్షుడు. 16 భాషల్లో... సినీ నేపథ్య గాయకుడిగా ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న’(1966) చిత్రం ద్వారా పరిచయమయ్యారు బాలు. ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్‌కు ‘కోదండపాణి ఆడియో ల్యాబ్స్’అని పేరు పెట్టారు బాలు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ.. ఇలా సుమారు 16 భాషల్లో పాటలు పాడారు. వారాల అబ్బాయిగా విద్యాభ్యాసం శ్రీకాళహస్తి/నగరి (చిత్తూరు జిల్లా): అప్పట్లో నెల్లూరు జిల్లాలో ఉండే కోనేటమ్మపేట (ప్రస్తుతం తమిళనాడు)లో జన్మించిన బాలు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వారాల అబ్బాయిగా ఉండి విద్యాభ్యాసం చేశారు. తొలుత నగరి పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న తన మేనమామ ఇంట్లో ఉండి పీసీఎన్ ప్రభుత్వ హైస్కూల్లో ఎనిమిదో తరగతి వరకూ చదివారు. అక్కడ రాధాపతి అయ్యవారు వద్ద విద్యాభ్యాసం చేశారు. తర్వాత రాధాపతి అయ్యవారు శ్రీకాళహస్తి పానుగంటి రాజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చారు. ఆయనతో పాటే బాలు కూడా శ్రీకాళహస్తి వచ్చి.. 9, 10 తరగతులు, 1960లో ఎస్ఎస్ఎల్సీని పూర్తిచేశారు. రాధాపతి అయ్యవారు వద్ద వారాల అబ్బాయిగా ఉండి చదువుకునేవారు. తన గురువు అంటే బాలుకు ఎనలేని గౌరవం ఉండేది. శ్రీకాళహస్తికి బాలు తండ్రి శ్రీకాళహస్తిలో ఎస్పీ బాలు ఉండగా.. ఆయన తండ్రి ఎస్పీ సాంబమూర్తి కూడా అక్కడికి వచ్చి బొజ్జ కృష్ణదాసు సాయంతో హరికథ చెబుతూ, నాటకాలు ప్రదర్శిస్తూ జీవనం సాగించేవారు. 1959లో రామదాసు నాటకాన్ని ప్రదర్శించగా.. అందులో బాలు రామదాసు కుమారునిగా అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందారు. మొదటి పాట రికార్డు శ్రీకాళహస్తిలోనే.. శ్రీకాళహస్తిలో రాధాపతి అయ్యవారుతో పాటు జి.బాలసుబ్రహ్మణ్యం అనే సైన్స్ ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన చెన్నై నుంచి తెప్పించిన టేప్ రికార్డర్లో బాలు పాడిన పాట రికార్డు చేశారు. భక్తప్రహ్లాద పాటను అలా తొలిసారిగా రికార్డు చేశారు. తొలిసారిగా తాను సినిమాలో పాడిన పాట రికార్డును బాలు.. తన గురువులకు పంపి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి ఇంటర్వ్యూలో ఆ ఇద్దరినీ బాలు తలచుకుంటూ ఉండేవారు. -
ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత
కైరో: ప్రఖ్యాత ఈజిప్షియన్, హాలీవుడ్ నటుడు ఒమర్ షరీఫ్(83) శుక్రవారం కైరోలో గుండెపోటుతో మరణించారు. అల్జీమర్స్ వ్యాధి వల్ల కొంతకాలంగా ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ఆయనకు మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమారుడు (తారిఖ్ ఎల్ షరీఫ్) ఉన్నారు. లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ ఝివాగో వంటి సినిమాల్లో నటన ద్వారా ఒమర్ షరీఫ్ అంతర్జాతీయంగా ప్రసిద్ధినొందారు. లారెన్స్ ఆఫ్ అరేబియాలో నటనకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇదే సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డునూ గెలుచుకున్నారు. చే సినిమాలో చే గువేరా పాత్రనూ పోషించారు. 1953 నాటి ద బ్లేజింగ్ సన్ సినిమాలో తనతో పాటు నటించిన ఫాతెన్ హమామాను షరీఫ్ వివాహమాడారు. తనతో కలిసి అనేక సినిమాల్లో నటించిన హమామాను పెళ్లి చేసుకునేందుకు క్రై స్తవుడైన ఆయన ఇస్లాం స్వీకరించారు. చివరిసారిగా 2013లో రాక్ ద కాస్బా సినిమాలో నటించారు.