
సౌత్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో ఓ ఇంటర్‌నేషనల్ స్పై మూవీ చేయాలనే ఆలోచన ఉందని ట్వీటర్ వేదికగా చెప్పారు హాలీవుడ్ స్టార్ యాక్టర్ విలియమ్ హెన్రీ డ్యూక్. అమెరికన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ డ్యూక్ ‘యాక్షన్ జాక్సన్’ (1988), ‘నెవర్ ఎగైన్’ (2001), ‘మాండీ’ (2018) సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు తనకు మహేశ్‌తో సినిమా చేయాలని ఉందంటున్నారు. ‘‘మురుగదాస్, మహేశ్ మీరు లాస్ ఏంజిల్స్ వచ్చినప్పుడు డీటీఎల్‌ఏ (డౌన్‌టౌన్ లాస్‌ఏంజెల్స్)లో దిగి లంచ్‌కి రండి.
ఇంటర్‌నేషనల్ స్పై సినిమా గురించి చర్చించుకుందాం. వంశీ పైడిపల్లి, మహేశ్ మీరు లాస్ ఏంజిల్స్ వచ్చినప్పుడు లంచ్‌కి వస్తే, ఇంటర్‌నేషనల్ స్పై మూవీ గురించి చర్చించుకుందాం’’ అని మరో ట్వీట్ చేశారు డ్యూక్. అలాగే మహిళల అక్షరాస్యత గురించి మాట్లాడుకుందామని రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ఉద్దేశించి ట్వీట్ చేశారు డ్యూక్. ఐశ్వర్యను 2016లో ‘ఉమెన్ గుడ్‌విల్ అంబాసిడర్’గా ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment