
సాక్షి : మనం చూసే కళ్లు కూడా ఒక్కొసారి మనల్ని మోసం చేస్తాయి. అలాంటి సంఘటన ఒకటి అమెరికాలోని ఇండియానాలో చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి ఓ నటుడిని దొంగ అనుకొని ఆయనపై కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ పక్కనున్న గోడకు తగలడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.
వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ నటుడు జెఫ్ డఫ్ ఓ సినిమాలో దొంగ పాత్రలో నటిస్తున్నారు. అందులో భాగంగా అమెరికాలోని ఓ బ్యాంక్ ముందు సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ ముఖానికి మాస్క్ వేసుకొని జెఫ్ డఫ్ బ్యాంక్‌ను రాబరి చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి జెఫ్ డఫ్ చేతిలో ఉన్న నకిలీ తుపాకీని చూసి నిజంగానే దొంగతనానికి వచ్చాడని ఆయనపై కాల్సులు జరిపాడు.
దీంతో డఫ్ ఒక్కసారిగా బయంతో వణికిపోయాడు. బుల్లెట్ గురి తప్పి పక్కన ఉన్న గోడకు తగలడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అక్కడే ఉన్న సినిమా బృందం అతను నిజమైన దొంగ కాదు. ఇది సినిమా షూటింగ్. గన్ను పారేయండని అరిచారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment