
అమెరికాలో హత్యానేరంపై పోలీస్ అధికారి అరెస్ట్
అమెరికాలో నల్ల జాతీయుడిని కాల్చి చంపిన నేరంపై ఒక శ్వేతజాతి పోలీస్ అధికారిపై పోలీసులు హత్యాకేసును నమోదు
వాషింగ్టన్: అమెరికాలో నల్ల జాతీయుడిని కాల్చి చంపిన నేరంపై ఒక శ్వేతజాతి పోలీస్ అధికారిపై పోలీసులు హత్యాకేసును నమోదు చేశారు. సౌత్ కరొలినా రాష్ట్రంలోని నార్త్ చార్లెస్టన్ నగరంలో శనివారం చిన్న పాటి ఘర్షణ అనంతరం వెళ్లిపోతున్న వాల్టర్ స్కాట్(50) నల్ల జాతీయుడిపై మేఖేల్ స్లేగర్ అనే పోలీస్ అధికారి వెనకనుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపిన దృశ్యం వీడియోలో రికార్డు అయింది.
దాంతో స్లేగర్‌పై జీవిత ఖైదు, లేదా మరణశిక్ష విధించే అవకాశమున్న హత్యానేరాన్ని నమోదు చేసి, బుధవారం అరెస్ట్ చేశారు. ఇటీవల నల్లజాతీయులపై పోలీసుల ఆగడాలు మితిమీరడం, అది వర్ణవివక్షేనంటూ దానిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ అరుదైన అరెస్ట్ చోటు చేసుకుంది.