ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన ఆస్కార్ పండుగ కొన్ని గంటల క్రితమే ముగిసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో వైభవంగా జరిగింది. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమాలు పోటీలో నిలిచాయి. అయితే అంతిమంగా ఒక్కరినే అవార్డ్ వరిస్తుంది. అలా ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పలు చిన్న సినిమాలు సైతం సత్తా చాటాయి. అయితే అవార్డ్ దక్కించుకున్న చిత్రాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఆ సినిమాల్లో ఎలాంటి సందేశం ఉందో తెలుసుకోవాలనుకునే చాలా మందే ఉంటార. అలాంటి వారికోసం విజేతలుగా నిలిచిన చిత్రాలు ఏ ఓటీటీలో అలరిస్తున్నాయో తెలుసుకోవాలనుందా? అయితే ఇది మీకోసమే.
ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకున్న సినిమా
అయితే ఈ ఏడాది ఆస్కార్‌లో ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకొన్న చిత్రం 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్'. ఈ సినిమా ఏడు అవార్డులతో రికార్డు సృష్టించింది. ఈ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే భారత్ నుంచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ దక్కింది. అలాగే ఇండియా నుంచి షార్ట్ షిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా సిని ప్రేక్షకులను అలరిస్తోంది.
ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఆస్కార్ అవార్డులు పొందిన కొన్ని చిత్రాలు
ఆర్‌ఆర్‌ఆర్ - జీ5, డిస్నీ + హాట్ స్టార్
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ - సోనీలీవ్
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ - నెట్‌ఫ్లిక్స్
బ్లాక్‌పాంథర్-వకండా ఫరెవర్ - డిస్నీ+ హాట్‌స్టార్
అవతార్ 2 - అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, వుడ్, డిస్నీ+హాట్‌స్టార్
టాప్ గన్: మావెరిక్ - అమెజాన్ ప్రైమ్ వీడియో ( తెలుగు ఆడియో కూడా ఉంది)
ది ఎలిఫెంట్ విస్పరర్స్ - నెట్‌ఫ్లిక్స్
పినాషియో - నెట్‌ఫ్లిక్స్
కాగా.. ఉమెన్ టాకింగ్, నవానీ, ది వేల్ లాంటి చిత్రాలు ప్రస్తుతం భారత్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో లేవు.
Comments
Please login to add a commentAdd a comment