Jr NTR Emotional Words About RRR Team Winning Oscar Award - Sakshi
Sakshi News home page

Junior NTR: RRRలో మీరు చూసింది అదే: జూనియర్ ఎన్టీఆర్

Published Mon, Mar 13 2023 6:40 PM | Last Updated on Mon, Mar 13 2023 7:01 PM

Junior NTR Emotional Words About Oscar Award Winning Of RRR team - Sakshi

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కడంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భారతదేశ సంస్కృతిపై మాట్లాడుతూ ఎమోషనలయ్యారు. భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న దేశమని కొనియాడారు. అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లో జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది.  

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..'భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న  వైవిధ్యమైన దేశం. ఆర్ఆర్ఆర్‌లో మీరు చూసింది అదే. ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ  యాక్షన్‌తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి. ఇప్పుడు ఇండియన్స్‌కు పూర్తి నమ్మకం కలిగింది.' అని  అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement