Oscars 2023 Live Updates In Telugu: Complete Winners List For The 95th Academy Awards - Sakshi
Sakshi News home page

Oscar Awards Ceremony 2023 Live Updates: ఎవరెవరిని ఆస్కార్‌ వరించిందంటే?

Published Mon, Mar 13 2023 6:41 AM | Last Updated on Mon, Mar 13 2023 11:38 AM

95th Oscar Awards 2023 Presentation Ceremony Updates - Sakshi

ఇంగ్లీష్‌ గడ్డపై ఇండియన్‌ సినిమా సత్తా చాటింది. చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌.. తెలుగు పాట ‘నాటు నాటు’ను వరించింది. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ వచ్చింది.  ఆదివారం (మార్చి 12) రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు)  లాజ్‌ ఏంజిల్స్‌ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది.  23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. 

► ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ ఆస్కార్‌ గెలుచుకుంది. ఉత్తమ నటిగా ‘మిషెల్‌ యో’ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీ వేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)  నిలిచింది. ఈ అవార్డు వేడుకలలో ఈ ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ చిత్రానికి ఏకంగా ఏడు ఆస్కార్స్ రావడం గమనార్హం. 

ఉత్తమ నటుడిగా బ్రెండన్ ప్రాసెర్‌(ది వేల్‌)ఆస్కార్‌ అందుకున్నాడు. ఉత్తమ నటుడి విభాగంలో బ్రెండన్‌తో  ఆస్టిన్‌ బట్లర్‌ (ఎల్విస్‌), కొలిన్‌ ఫార్రెల్‌ (ది బన్షీష్‌ ఆఫ్‌ ఇని షెరిన్‌), బిల్‌ నిగీ (లివింగ్‌),పాల్‌ మెస్కల్‌ (ఆఫ్టర్‌సన్‌) పోటీ పడ్డారు. అయితే , ‘ది వేల్‌’ చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్రెండెన్‌ ఫ్రాసెర్‌ను ఆస్కార్‌ వరించింది. 

► 95వ అకాడమీ అవార్డ్స్‌లో  ఉత్తమ దర్శకుడిగా డానియల్ క్వాన్.. డేనియల్ షినెర్ట్ అస్కార్‌ అందుకున్నారు. ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ చిత్రానికి గాను ఈ దర్శక ద్వయం అవార్డు గెలుచుకున్నారు.  ఈ కేటగిరిలో టాడ్ ఫీల్డ్ – టార్, మార్టిన్ మెక్‌డొనాగ్ – ది బాన్‌షీస్ ఆఫ్ ఇనిషెరిన్, రూబెన్ ఓస్ట్‌లండ్ – ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ – ది ఫాబెల్‌మాన్స్ నామినేట్ అయ్యారు.

బెస్ట్ సౌండ్ విభాగంలో హాలీవుడ్‌ మూవీ ‘టాప్ గన్ ’ ఆస్కార్‌ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, ది బాట్‌మాన్, ఎల్విస్ పోటీపడ్డాయి.

► ఇంగ్లీష్‌ గడ్డపై తెలుగు పాట సత్తా చాటింది. 95వ ఆస్కార్‌ వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని  ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ లభించింది. బెస్ట్‌  ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా నాటు నాటు నిలిచింది. కీరవాణి స్వరపరచిన ఈపాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, రాహుల్‌ సిప్లిగంజ్, కాలభైరవపాడిన సంగతి తెలిసిందే. ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకుంటూ వేదికపై పాట పాడారు. 

► బెస్ట్‌ అడాప్టెడ్‌ స్ట్రీన్‌ప్లే విభాగంలో హాలీవుడ్‌ చిత్రం‘  ఉమెన్‌ టాకింగ్‌’కు అస్కార్‌ లభించింది. షేరా పాల్లే ఈ అవార్డును అందుకున్నారు. 

ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ చిత్రాన్ని ఆస్కార్‌ వరించింది. బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ఈ చిత్రానికి అవార్డు లభించింది. డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌ షేనెర్ట్‌లు ఈ అవార్డులు అందుకున్నారు. 

► జెమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన  ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ను ఆస్కార్‌ వరించింది.  బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్‌మ్యాన్, బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్, టాప్ గన్ మావెరిక్ చిత్రాలు పోటీ పడ్డాయి.

►  బెస్ట్ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో  ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ చిత్రం ఆస్కార్‌ అందుకుంది. ఈ విభాగంలో బాబిలోన్, ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మరియు ది ఫాబెల్మాన్స్ పోటీ పడగా..’ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ గెలిచింది. వాకర్‌ బెర్టెన్‌ మాన్‌ ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’కు సంగీతం అందించారు. 

► బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌ విభాగంలో  ‘ఆల్‌ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్ ఫ్రంట్‌’ చిత్రం ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. క్రిస్టియన్‌ ఎం గొల్డెబెక్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరించగా, ఎర్నిస్టైన్‌ హిప్పర్‌ సెట్‌ డిజైనర్‌గా ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ అవార్డ్ కోసం అవతార్‌ 2, Babylon, Elvis, The Fabelmans చిత్రాలు పోటీ పడ్డాయి.

► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్ కు ఆస్కార్‌ లభించింది. ఈ అవార్డ్ కోసం ది ఫ్లయింగ్ సెయిలర్, ఐస్ మర్చంట్స్, మై ఇయర్ ఆఫ్ డిక్స్, యాన్ ఓస్ట్రిచ్ టోల్డ్ మి ది వరల్డ్ ఈజ్ ఫేక్, ఐ థింక్ ఐ బిలీవ్ ఇట్ షార్ట్ ఫిల్మ్ నామినేట్ అయ్యాయి.

నయా చరిత్ర
బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ సినిమా ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ను ఆస్కార్‌ వరించింది. ఇండియా నుంచి గెలుపొందిన మొట్ట మొదటి బెస్ట్ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ చరిత్ర సృష్టించింది. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్‌ ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. 

► ఆస్కార్ వేదికపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు సాంగ్ పాడారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్‏లో.. లాల్చీ, పంచకట్టులో కనిపించారు సింగర్స్.

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ చిత్రం ఆస్కార్ దక్కించుకుంది. ఈ అవార్డ్ కోసం “బాబిలోన్”, “బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్”, “ఎల్విస్”, “ఎవరీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్”, “మిసెస్ హారిస్ గోస్ టు ప్యారిస్” చిత్రాలు పోటీపడ్డాయి.

► బెస్ట్ సినిమాటోగ్రఫీ - ఆల్ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్ ఫ్రంట్

► బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్‌బై

► బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్- నావల్నీ

► బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌ - జేమీ లీ కర్టిస్(ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్)

► బెస్ట్ సపోర్టింగ్‌ యాక్టర్-  కి హుయ్ క్వాన్(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్‌ ఎట్ వన్స్‌)

► బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్- గిల్లెర్మో డెల్ టోరోస్ పినాకియో

ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికాలోని   లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్నఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు హాజరయ్యారు. టాలీవుడ్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఇద్దరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఎన్టీఆర్ ఎడమ భుజంపై టైగర్ బొమ్మ ఉన్న డ్రెస్ ధరించగా, చరణ్ ఎడమ ఛాతీపై ప్రత్యేక డిజైన్ కలిగిన డ్రెస్ వేసుకున్నాడు.ఈ వేడుకలకు చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి వచ్చాడు. దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణీ, చంద్రబోస్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌,  కాలభైరవ, ప్రేమ్ రక్షిత్‌తో పాటు మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement