Oscar Award Ceremony 2023: Bear Is The Center Of Attraction At Event, Details Inside - Sakshi
Sakshi News home page

Oscars 2023: ఆస్కార్ వేదికపై ఎలుగుబంటి.. అసలు విషయమిదే..!

Published Mon, Mar 13 2023 4:01 PM | Last Updated on Mon, Mar 13 2023 4:22 PM

Oscar Award Ceremony Bear is the Center Of Attraction at event - Sakshi

అమెరికాలోని లాస్ ఎంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డ్ వేడుక ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు వీక్షించారు. ఈ వేడుకలో సినీరంగంలో అత్యుత్తమ ప్రతిభ చాటిన ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన సినిమాలకు అవార్డులు ప్రకటిస్తారు. ఈ వేడుక కోసం ఆస్కార్ అకాడమీ నిర్వాహకులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్‌లో  అందరి దృష్టిని ఆకర్షించింది ఏంటో తెలుసా? వేదికపై అందరినీ అలరిస్తూ సందడి చేసిన ఓ ఎలుగుబంటి. ఇంతకీ ఆ వేదికపై ఎలుగుబంటి ఎందుకొచ్చిందా అని సందేహం మీకు వచ్చి ఉండొచ్చు. పదండి ఆ ఎలుగుబంటి కథేంటో తెలుసుకుందాం.

ఆస్కార్ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఎలుగుబంటి ఓ సినిమాలోని పాత్ర.  ఎలిజబెత్ బ్యాంక్స్ కామెడీ థ్రిల్లర్‌ మూవీలో ఎలుగుబంటి అలరించింది. ఈ ఏడాది ఆస్కార్ వేడుకపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.  ఈవెంట్‌లో పాల్గొన్న సినీ దిగ్గజాలను పలకరిస్తూ సందడి చేసింది. దీంతో నెటిజన్స్ దీనిపై ఆరా తీస్తున్నారు. ఆస్కార్ వేదికపై మెరిసిన ఆ ఎలుగుబంటి గురించి ఆసక్తి కనబరుస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement