హై ‘అలర్ట్’ | High 'Alert' | Sakshi
Sakshi News home page

హై ‘అలర్ట్’

Published Sun, Mar 30 2014 2:54 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

High 'Alert'

  • పోలింగ్ కేంద్రాల వద్ద గట్టినిఘా
  •  అధికారులు, సిబ్బంది నిష్పక్ష పాతంగా వ్యవహరించాలి
  •  పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవ్
  •  ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’పై సిబ్బందితో సమీక్షించిన ఎస్పీ సెంథిల్‌కుమార్
  •  అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ‘ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి...సమస్యలు సృష్టించే వారిని గుర్తించాలి...అల్లర్లకు తావివ్వకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎవరు తోక జాడించినా తక్షణం ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ వారిని అదుపులోకి తీసుకోవాలి’ అంటూ పోలీసు సిబ్బందికి ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాలు చేశారు. నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో శనివారం జిల్లా వ్యాఫ్తంగా ఉన్న సిబ్బందితో ఆయన ‘ఎన్నికల నియమావళి’పై సమీక్షించారు. ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాలకు లోబడి ప్రతి ఒక్కరూ వ్యవహరించాలన్నారు. ఎస్పీ ఇంకా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
     
    అధికారుల విధులు..
     
    సబ్ డివిజన్, సర్కిల్స్ పరిధిలోని సిబ్బం దిపై పర్యవేక్షణ కలిగివుండాలి. సిబ్బంది నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకొని విశ్లేషిస్తూ ఉండాలి. వీలైనన్ని సమస్యాత్మక గ్రామాలు, వార్డులు సందర్శించాలి. కిందిస్థాయి సిబ్బంది అన్ని గ్రామాలు, వార్డులపై పట్టు సాధి స్తూ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పుడు సమయ స్ఫూర్తితో వ్యవహరించాలి. పోలింగ్‌స్టేషన్, బూత్‌లు పరిశీలించి అక్కడ ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌లను పర్యవేక్షిస్తుండాలి.

    అత్యంత ప్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎస్‌డీపీఓలు ఆయా సబ్-డివిజన్‌లలోని అన్ని రాజకీ య పార్టీ నాయకులతో సమన్వయంగా వ్యవహరించాలి. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో గ్రామాలు, వార్డులలో ఆకస్మిక తనిఖీలు సిబ్బంది పనితీరును అంచనా వేస్తుండాలి. ప్రతి ఉదయం డీఎస్పీలు సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్ధితులను సమీక్షిస్తుండాలి. ఎన్నికల శాంతియుతంగా, సజావుగా సాగడానికి తాము తీసుకున్న చర్యలను ప్రజలకు తెలియజేస్తుండాలి.
     
    పోలింగ్ రోజు ఇలా ఉండాలి..
     
    ప్రతి ఓటరు ఓటరు ఐడెంటిటీ కార్డును తప్పని సరిగా తెచ్చుకునేలా అవగాహన పెంచాలి. పోలింగ్‌బూత్‌కు 200 మీటర్ల లోపల ఏ పార్టీకి చెందిన వారైనా ఓటరు స్లిప్పుల పంపిణీ, ఆహార పొట్లాల పంపిణీ శిబిరాలు ఏర్పాటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కేంద్రాల వద్ద క్యూ పద్ధతి పాటించేలా చూడాలి. పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు ఘర్షణ పడకుండ ముందస్తు హెచ్చరికలు చేయాలి. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు వహించాలి. ప్రతి వ్యక్తినీ తనిఖీ చేసి పోలింగ్‌బూత్‌లోకి అనుమతించాలి. పోలింగ్ కేంద్రంల్లోకి అగ్గిపెట్టెలు, సిజర్‌లైట్లు ఇంకు, నీళ్ల బాటిళ్లు, తినబండారాలు, పేలుడు పదార్ధాలను అనుమతించరాదు.

    పోలింగ్ సామగ్రికి ఎటువంటి  నష్టం రాకుండా చూడాలి. వాహనాల కదిలకలను నియంత్రించాలి. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగితే పై అధికారులకు తెలియజేసి, పోలింగ్ అధికారులతో సంప్రదించి సకాలంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలి. పోలీసు సిబ్బంది ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆవేశానికి లోనుకారాదు. అభ్యర్ధులతోపాటు వచ్చిన గన్‌మెన్‌లను, అనుమతి లేని వ్యక్తులను కేంద్రాలలోకి అనుమతించరాదు. అభ్యర్ధులు వారి అనుచరులు చూపే  ప్రలోభాలకు లొంగకుండా సిబ్బంది ఎన్నికల డ్యూటీని చిత్తశుధ్ధితో, కర్తవ్య దీక్షతో నిర్వహించాలి.

    పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మి షన్, బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేం ద్రాలకు భద్రంగా చేరవేయాలి. సమీక్ష స మావేశంలో డీఎస్పీ నాగరాజు, వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ సీఐలు మాదవ్, మన్సూరుద్దీన్, దేవానంద్, ఎస్‌ఐలు వి శ్వనాథచౌదరి, సుబ్బరాయుడు, శంకర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement