
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ (K. K. Senthil Kumar) గుండెలో భారం మోస్తూనే ఉన్నాడు. భార్య లేని జీవితం ఎంతో బాధాకరంగా ఉందంటున్నాడు. తన సతీమణి రూహి (Roohi Yogi)ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. నువ్వు లేకుండా ఏడాది గడిచిపోయింది.. నీ నవ్వులు, నీ ప్రేమ లేకుండానే 365 రోజులు గడిచిపోయాయి. ఈ సమయమంతా నీ జ్ఞాపకాలు, కన్నీళ్లతోనే నిండిపోయింది. ఎప్పుడూ నాకేం గుర్తొస్తుంటాయో తెలుసా?
రెస్ట్ ఇన్ పీస్ మై డార్లింగ్..
నువ్వు నావైపు చూసినప్పుడు నీ నవ్వు, కళ్లలో మెరుపు, నా చేతిలో నువ్వు చేయేసే విధానం.. పదేపదే గుర్తొస్తాయి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, ఛాంపియన్.. నా సర్వస్వం కూడా! నువ్వు పంచిన ప్రేమ, మనం కలిసి చేసిన పనులు.. అన్నింటినీ జీవితాంతం గుర్తుంచుకుంటాను. రెస్ట్ ఇన్ పీస్ మై డార్లింగ్. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు. ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని రాసుకొచ్చాడు. రూహితో కలిసి దిగిన పాత ఫోటోను ఈ పోస్ట్‌కు జత చేశాడు.
ప్రేమ పెళ్లి
మగధీర సినిమా షూటింగ్ సమయంలో సెంథిల్, రూహి ప్రేమలో పడ్డారు. 2009లో పెళ్లి చేసుకున్నారు. రూహి.. యోగా టీచర్. అనుష్క, ప్రభాస్, ఇలియానా వంటి ఎంతోమంది సెలబ్రిటీలకు ఆమె యోగా శిక్షణ ఇచ్చింది. 2024 ఫిబ్రవరి 15న రూహి అనారోగ్యంతో మరణించింది. సెంథిల్ కుమార్ విషయానికి వస్తే.. ఛత్రపతి, ఈగ, మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు.
చదవండి: తెలుగు సినిమా సెట్‌లో పదేపదే ఇబ్బంది పెట్టారు: శ్వేతా బసు ప్రసాద్