
పారిస్: భారత స్క్వాష్ ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ తన కెరీర్‌లో ఎనిమిదో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) టైటిల్‌ను సాధించాడు. పారిస్‌లో జరిగిన బ్యాచ్ ఓపెన్ చాలెంజర్ టోర్నీలో తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల వెలవన్ విజేతగా నిలిచాడు.
ఫైనల్లో ప్రపంచ 58వ ర్యాంకర్ వెలవన్ 11–6, 11–9, 11–6తో మెల్విల్ సియానిమానికో (ఫ్రాన్స్)పై గెలుపొంది ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఈ సంవత్సరం నాలుగు టోర్నీలలో పాల్గొన్న వెలవన్ రెండింటిలో క్వార్టర్ ఫైనల్ చేరి, మరో రెండింటిలో రెండో రౌండ్‌లో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment