విక్కీరాజ్, రమేశ్
శ్రీనివాసరెడ్డి, సెంథిల్ కుమార్, బాబు రాజన్, దేవన్, సరోజిత్, స్నేహాకపూర్ ముఖ్య తారలుగా రమేష్ చౌదరి దర్శకత్వంలో విక్కీరాజ్ నిర్మించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. ఈ నెల 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ మాట్లాడుతూ– ‘‘శరత్, మోహన్‌గాంధీ, కె. వాసు, తాతినేని లక్ష్మీవరప్రసాద్ వంటి దర్శకుల దగ్గర పనిచేశాను. నా పిల్లల చదువుకోసం టైమ్ స్పెండ్ చేయడం వల్ల నేను దర్శకునిగా పరిచయం అవ్వడం ఆలస్యం అయ్యింది. విక్కీరాజ్‌గారు చాలా బిజీగా ఉంటారు. ఓ ప్రయాణంలో ఆయన పరిచయం అయ్యారు. ఈ సినిమా కథ చెప్పాను. ఆయనకు నచ్చింది.
షూటింగ్ స్టార్ట్ చేశాం. పదిమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సంబంధించిన కథ ఇది. వారు విహారయాత్రం కోసం అడవుల్లోకి వెళ్లినప్పుడు ఏం జరిగింది? అనే అంశం చుట్టూ సినిమా ఉంటుంది. ప్రతి ఐదు సీన్లకు ఓ సస్పెన్స్ ఉంటుంది. ఇందులోని మర్డర్ మిస్టరీ ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. యువతకు తగ్గట్లు ఉంటుంది. మలేసియాలో చిత్రీకరించిన క్లైమాక్స్, హైదరాబాద్‌లో షూట్ చేసిన ఓ పబ్‌సాంగ్ హైలైట్‌గా ఉంటాయి. టీమ్ అందరూ బాగా నటించారు. విక్కీరాజ్‌గారితోనే నా నెక్ట్స్ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘కథ విన్నప్పుడు ఎగై్జటింగ్‌గా అనిపించింది. కాస్త డబ్బులు రాగానే లైఫ్‌స్టైల్‌ని మార్చుకుని హైఫై లైఫ్‌ని లీడ్ చేయడానికి ఇష్టపడతారు కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. వారికి చెందిన కథే ఇది. సోషల్ మెసేజ్ కూడా ఉంది’’ అన్నారు విక్కీరాజ్.
Comments
Please login to add a commentAdd a comment