sneha kapoor
-
ప్రతి ఐదు సీన్లకు సస్పెన్స్
శ్రీనివాసరెడ్డి, సెంథిల్ కుమార్, బాబు రాజన్, దేవన్, సరోజిత్, స్నేహాకపూర్ ముఖ్య తారలుగా రమేష్ చౌదరి దర్శకత్వంలో విక్కీరాజ్ నిర్మించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. ఈ నెల 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ మాట్లాడుతూ– ‘‘శరత్, మోహన్‌గాంధీ, కె. వాసు, తాతినేని లక్ష్మీవరప్రసాద్ వంటి దర్శకుల దగ్గర పనిచేశాను. నా పిల్లల చదువుకోసం టైమ్ స్పెండ్ చేయడం వల్ల నేను దర్శకునిగా పరిచయం అవ్వడం ఆలస్యం అయ్యింది. విక్కీరాజ్గారు చాలా బిజీగా ఉంటారు. ఓ ప్రయాణంలో ఆయన పరిచయం అయ్యారు. ఈ సినిమా కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. షూటింగ్ స్టార్ట్ చేశాం. పదిమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించిన కథ ఇది. వారు విహారయాత్రం కోసం అడవుల్లోకి వెళ్లినప్పుడు ఏం జరిగింది? అనే అంశం చుట్టూ సినిమా ఉంటుంది. ప్రతి ఐదు సీన్లకు ఓ సస్పెన్స్ ఉంటుంది. ఇందులోని మర్డర్ మిస్టరీ ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. యువతకు తగ్గట్లు ఉంటుంది. మలేసియాలో చిత్రీకరించిన క్లైమాక్స్, హైదరాబాద్‌లో షూట్ చేసిన ఓ పబ్‌సాంగ్ హైలైట్‌గా ఉంటాయి. టీమ్ అందరూ బాగా నటించారు. విక్కీరాజ్గారితోనే నా నెక్ట్స్ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘కథ విన్నప్పుడు ఎగై్జటింగ్‌గా అనిపించింది. కాస్త డబ్బులు రాగానే లైఫ్‌స్టైల్‌ని మార్చుకుని హైఫై లైఫ్‌ని లీడ్ చేయడానికి ఇష్టపడతారు కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వారికి చెందిన కథే ఇది. సోషల్ మెసేజ్ కూడా ఉంది’’ అన్నారు విక్కీరాజ్. -
ఎలా బయటపడ్డారు?
అమర్, ప్రదీప్ వర్మ, ఉదయ్, అభి, సి.టి, ఖాదర్, లక్ష్మీ, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. ఇందులో శ్రీనివాస రెడ్డి కీలక పాత్ర పోషించారు. కనగాల రమేష్ చౌదరి దర్శకత్వంలో విక్కి రాజ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రమేష్ మాట్లాడుతూ– ‘‘దాదాపు 32ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్‌గా చిత్రపరిశ్రమలో పని చేసిన నేను దర్శకునిగా తెరకెక్కించిన తొలి చిత్రమిది. సాఫ్ట్వేర్ కంపెనీలో బాగా పనిచేసే ఓ పది మంది ఉద్యోగులను ఆ కంపెనీ ఎండీ కేరళ టూర్‌కి పంపిస్తాడు. కేరళ అడవుల్లో జరుగుతున్న కోయవారి జాతరకు వెళ్లిన ఆ పదిమంది అక్కడే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలా బయటపడ్డారనేది చిత్రకథాంశం. మలేసియాలో తీసిన క్లైమాక్స్ ఓ హైలైట్. దాదాపు 125 రోజుల పాటు రెండు షెడ్యూల్స్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. బాలీవుడ్ బ్యూటీ స్నేహా కపూర్ చేసిన స్పెషల్ సాంగ్ అదనపు ఆకర్షణ’’ అన్నారు. ఈ సినిమాకు ప్రదీప్ వర్మ సంగీతం అందించారు. -
సినిమా రంగంలో శ్రీశాంత్
క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్ గురించి తెలియని వారుండరు. కొంత కాలం స్టార్ ప్టేయర్‌గా మెరిసిన ఈయన ఆ మధ్య బెట్టింగ్ ఆరోపణలతో బహిష్కరణకు గురై విషయం తెలిసిందే. ఈ సంచలన క్రీడాకారుడిప్పుడు తన దృష్టిని సినిమా రంగంపై సారించారు. ఈ రంగంలో నటుడిగా, సంగీత దర్శకుడిగా తన ప్రతిభను చాటుకోనున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న అన్బుళ్ల అళగే అనే చిత్రానికి సంగీతాన్ని అందించడంతోపాటు ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు. అంతేకాదు శ్రీశాంత్ రియాలిటీ షో కోసం ప్రాక్టీస్ చేస్తుండడం విశేషం. ప్రముఖ డ్యాన్సర్, నృత్య దర్శకురాలు స్నేహా కపూర్ ఈ షోకు నృత్య దర్శకత్వ బాధ్యతలను నిర్వహించనున్నారని శ్రీశాంత్ సోదరుడు నిర్వాహకుడు దీపుశాంత్ వెల్లడించారు. శ్రీశాంత్ ఇప్పటికే ఒక స్టేజీ ప్రోగ్రామ్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్‌తో కలిసి ఆడి తన డ్యాన్స్ స్కిల్‌ను నిరూపించుకున్నారు. ఈ రియాలిటీ షోకు క్రికెట్ క్రీడాకారులు పురబ్ కోహ్లి, సుబే విందర్ సింగ్, సోపియ చౌదరి, నటుడు రణ్వీర్ షోర్లు అతిథులుగా పాల్గొననున్నారు. ఈ షోకు నటి మాధురి దీక్షిత్, కరణ్ జోహార్, రెమో డి.సౌజాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనుండటం విశేషం.