సాక్షి, చిత్తూరు : ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. వచ్చే నెల(జనవరి) 9న అమ్మ-ఒడి కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ చిత్తూరు నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 47 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న అమ్మ ఒడి కార్యక్రమానికి స్థల పరిశీలన చేస్తున్నామని కలెక్టర్ భరత్ గుప్తా పేర్కొన్నారు. సీఎం జగన్ మొదటి సారి జిల్లాకు రానున్న నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తారని, అందుకు తగిన భద్రతతోపాటు చర్యలు తీసకుంటామని ఎస్పీ సెంథిల్ కుమార్ స్పష్టం చేశారు. అమ్మ ఒడి కార్యక్రమాన్ని ద్విగిజయం చేసేందుకు అందరం కలిసి కృషి చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment