చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్‌ | Cm Jagan Speech In Palamaner Public Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్‌

Published Sat, May 4 2024 3:20 PM | Last Updated on Sat, May 4 2024 4:15 PM

Cm Jagan Speech In Palamaner Public Meeting

చిత్తూరు జిల్లా, సాక్షి: ‘‘ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు.. పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం పలమనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందన్నారు.

‘‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక  మార్పులు తీసుకొచ్చాం. రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. పిల్లల చదువులు కోసం అమ్మఒడితో ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాం’’ అని  సీఎం జగన్‌ చెప్పారు

‘‘రైతన్నల కోసం ఆర్‌బీకే వ్యవస్థ పనిచేస్తోంది. ఏ గ్రామానికి వెళ్లిన గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?. మన ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎప్పుడైనా ఇచ్చారా అని అడుగుతున్నా.. 14 ఏళ్లు  సీఎంగా చేశాను అంటాడు చంద్రబాబు. ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు అబద్దాలు, మోసాలతో వస్తున్నాడు’’ అని సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

‘‘రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు.. చేశాడా?. ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?. సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చడా?. మళ్లీ ఈ మోసగాళ్లు సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటున్నారు. కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తాననంటారు.. నమ్ముతారా?’’ అంటూ చంద్రబాబు మోసాలను సీఎం జగన్‌ ఎండగట్టారు.

ప్రత్యేకహోదాను అమ్మేసిన బాబు లాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా?
•    మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాం
•    కొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారు
•    14 ఏళ్లపాటు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచైనా చేశాడా?
•    అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు
•    అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు చంద్రముఖి మారిపోతాడు
•    బాబు తన హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చాడా? 
•    ఈ 59 నెలల పాలనలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం
•    మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాం
•    మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 99 శాతం అమలు చేశాం
•    59 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ
•    ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి
•    చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే
•    మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది
•    గ్రామ సచివాలయాల్లో ప్రజలకు 600 రకాల సేవలు అందుతున్నాయి
•    వర్షం రూపంలో దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తున్నారని భావిస్తున్నా

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్‌

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement