ఇలా అవుతుందని ఊహించలేదు: చార్మీ, మంచు లక్ష్మి ఎమోషనల్‌ | Manchu Lakshmi And Charmi Kaur Emotional Comments On Senthil Kumar Wife Roohi Death, Posts Inside - Sakshi
Sakshi News home page

Senthil Kuamr Wife Rohi Death: షాక్‌లో ఉన్నాం.. మాటలు రావట్లే.. గుండె కలుక్కుమంటోంది

Published Fri, Feb 16 2024 9:17 AM | Last Updated on Fri, Feb 16 2024 9:39 AM

Manchu Lakshmi, Charmi Kaur Emotional Senthil Kumar Wife Roohi - Sakshi

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేకే సెంథిల్‌ కుమార్‌ భార్య, యోగా ట్రైనర్‌ రూహీ మరణవార్త అందరినీ కలిచివేస్తోంది. ఎంతోమంది తారలకు యోగా టీచర్‌గా పని చేసిన రూహి అనారోగ్యంతో గురువారం నాడు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. చార్మీ, మంచు లక్ష్మి.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఎమోషనలయ్యారు.

ఈ వార్త అబద్ధమైతే బాగుండు
'ప్రియమైన రూహి.. నీ కోసం ఇలాంటి పోస్ట్‌ వేస్తానని ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. మాటలు రావడం లేదు. నువ్వు ఇక లేవన్న వార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. మనం చివరిసారి కూడా ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం. 18 ఏళ్ల అందమైన స్నేహబంధం మనది. నిన్ను మిస్‌ అవుతానని చెప్పడం చిన్నమాటే అవుతుంది. నీ కుటుంబానికి ఆ దేవుడు మరింత శక్తినివ్వాలి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది చార్మీ.

డ్యాన్స్‌, నవ్వులు.. అవన్నీ..
మంచు లక్ష్మి.. రూహితో తన చివరి చాట్‌ను స్క్రీన్‌షాట్‌ తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 'రూహి నుంచి నాకు అందిన చివరి మెసేజ్‌ ఇదే! ప్రతివారం తనను జిమ్‌లో కలుస్తూ ఉండేదాన్ని. తన ముఖంలో ఎప్పుడూ ఒక నిష్కల్మషమైన నవ్వు కనిపిస్తూ ఉండేది. ఎంతో ఎనర్జీగా కనిపించేది. మేమిద్దరం ఒళ్లంతా చెమటలు పట్టేవరకు డ్యాన్స్‌ చేసేవాళ్లం.. దవడలు నొప్పిపుట్టేంతవరకు నవ్వుతూనే ఉండేవాళ్లం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని నువ్వు మరోసారి నిరూపించావు. ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు ఎంతో బాధగా ఉంది.

మేము అదృష్టవంతులం
సెంథిల్‌, తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తుంటేనే మనసు కలుక్కుమంటోంది. కానీ నువ్వు జీవితానికి సరిపడా ప్రేమను పంచి వెళ్లిపోయావు. నీతో కలిసి ప్రయాణం చేసిన మేమంతా ఎంతో అదృష్టవంతులం. ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్‌ ఇస్తూ సర్‌ప్రైజ్‌ చేసేదానివి.. ఇప్పుడు స్వర్గంలో ఉన్న ఏంజెల్స్‌కు యోగాసనాలు నేర్పిస్తున్నావని ఆశిస్తున్నాను. నిన్ను ఎంతగానో మిస్‌ అవుతున్నాను. ఇకపై నన్ను చూడటానికి రాలేవు. ఇలాంటి పోస్ట్‌ వేస్తానని కలలో కూడా ఊహించలేదు. నీ పేరు మీద ఈరోజు ప్రతిక్షణం సెలబ్రేట్‌ చేసుకుంటా.. ఇట్లు నీ స్నేహితురాలు లక్ష్మి' అని రాసుకొచ్చింది.

చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్ భార్య మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement